Tecno Spark Go 2024: రూ. 6,699 ధరకే డ్యూయల్ DTS స్పీకర్లతో కొత్త ఫోన్ వచ్చేసింది.!

HIGHLIGHTS

టెక్నో ఈరోజు ఇండియన్ మార్కెట్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది

Tecno Spark Go 2024 ను డ్యూయల్ DTS స్పీకర్లతో తీసుకొచ్చింది

ఈ ధర పరిధిలో ఈ ఫీచర్ తో వచ్చిన మొదటి ఫోన్

Tecno Spark Go 2024: రూ. 6,699 ధరకే డ్యూయల్ DTS స్పీకర్లతో కొత్త ఫోన్ వచ్చేసింది.!

బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేస్తున్న బేస్ బ్రాండ్ గా పేరొందిన టెక్నో ఈరోజు ఇండియన్ మార్కెట్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. ఇందులో వింతేముంది అందుకుంటున్నారా? ఈ ఫోన్ ను కేవలం రూ. 6,699 ధరకే డ్యూయల్ DTS స్పీకర్లతో తీసుకొచ్చింది. అదే, Tecno Spark Go 2024 స్మార్ట్ ఫోన్. ఈ ధర పరిధిలో ఈ ఫీచర్ తో వచ్చిన మొదటి ఫోన్ కూడా ఇదే అవుతుంది. కేవలం ఈ ఫీచర్ మాత్రమే కాదు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను ఈ కొత్త ఫోన్ కలిగి వుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Tecno Spark Go 2024 with DTS Speakers

ఈరోజు ఇండియన్ మార్కెట్ లో మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ టెక్నో స్పార్క్ గో 2024 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 6,699 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది టెక్నో. ఈ ఫోన్ డిసెంబర్ 7వ తేది నుండి అమేజాన్ ఇండియా మరియు టెక్నో అధికారిక వెబ్సైట్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Also Read : vivo S18 Series Launch: మూడు కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్న వివో.!

టెక్నో స్పార్క్ గో 2024

టెక్నో స్మార్ట్ గో 2024 స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన బిగ్ డాట్ ఇన్ డిస్ప్లేని డైనమిక్ పోర్ట్ ఫీచర్ తో కలిగి వుంది. ఈ స్మార్ట్ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అన్లాక్ ఫీచర్ ను కూడా కలిగి వుంది. ఈ కొత్త ఫోన్ ను Unisoc T606 ప్రోసెసర్ మరియు మెమొరీ ఫ్యూజన్ ఫీచర్ తో 6GB వరకూ ర్యామ్ మరియు 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

Tecno Spark Go 2024 with DTS Speakers
టెక్నో స్పార్క్ గో 2024

ఈ టెక్నో స్మార్ట్ ఫోన్ 13MP మైన్ AI లెన్స్ లతో డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ ను కలిగి వుంది. అలాగే, మూడు 8MP సెల్ఫీ కెమేరాని కూడా కలిగి వుంది. ఈ ఫోన్ HiOS 13.0 సాఫ్ట్ వేర్ పైన Android 13 Go Edition పైన పని చేస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ DTS స్పీకర్లతో కూడా వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో టైప్ సి పోర్ట్ తో 5000 mAh బ్యాటరీని కూడా కలిగి వుంది.

మొత్తంగా ఈ టెక్నో స్మార్ట్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలో ఆల్రౌండ్ ఫీచర్లను కలిగి ఉన్నట్లు చెప్పవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo