MacBook Air: పవర్ ఫుల్ M5 Chip తో కొత్త మ్యాక్ బుక్ ఎయిర్ లాంచ్ చేసిన ఆపిల్.!
కొత్త పవర్ ఫుల్ M5 Chip తో కొత్త మ్యాక్ బుక్ ఎయిర్ ను ఆపిల్ విడుదల చేసింది
ఎప్పటి లాగానే 13 ఇంచ్ మరియు 15 ఇంచ్ స్క్రీన్ మోడల్స్ లో అందించింది
ఈ లేటెస్ట్ మ్యాక్ బుక్ ఎయిర్ Apple M5 Chip తో లాంచ్ అయ్యింది
MacBook Air: టెక్ వరల్డ్ లో సూపర్ స్లీక్ అండ్ లైట్ వెయిట్ ల్యాప్ టాప్ కేటగిరిలో మ్యాక్ బుక్ ఎయిర్ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. స్టూడెంట్ మొదలుకొని ప్రొఫెషనల్స్ వరకు అందరికీ తగిన విధంగా గొప్ప పెర్ఫార్మెన్స్, లాంగ్ బ్యాటరీ లైఫ్ మరియు అద్భుతమైన డిజైన్ వంటి అన్ని అంశాల కలయికగా ఈ ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ ఇది నిలుస్తుంది. ఇప్పుడు కొత్త పవర్ ఫుల్ M5 Chip తో కొత్త మ్యాక్ బుక్ ఎయిర్ ను ఆపిల్ విడుదల చేసింది.
SurveyMacBook Air: ప్రైస్
మ్యాక్ బుక్ ఎయిర్ కొత్త వెర్షన్ ను కూడా ఎప్పటిలాగానే 13 ఇంచ్ మరియు 15 ఇంచ్ స్క్రీన్ మోడల్స్ లో అందించింది. ఇందులో 13 ఇంచ్ ల్యాప్ టాప్ ను రూ. 1,19,900 రూపాయల ప్రారంభ ధరతో మరియు 15 ఇంచ్ మోడల్ ను రూ. 1,44,900 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ ల్యాప్ టాప్ సిల్వర్ స్కై బ్లూ, స్టార్ లైట్ మరియు మిడ్ నైట్ నాలుగు కలర్స్ లో లభిస్తుంది.
ఈ లేటెస్ట్ ఆపిల్ ల్యాప్ టాప్ ప్రీ ఆర్డర్ ను ఈరోజు యాపిల్ ఆరంభించింది. ఇటీవల ఆపిల్ లాంచ్ చేసిన ఐఫోన్ 17e స్మార్ట్ ఫోన్ తో పాటు ఈ లేటెస్ట్ ల్యాప్ టాప్ కూడా మార్చి 11 వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ల్యాప్ టాప్ పై ఎలిజిబుల్ కార్డ్స్ రూ. 10,000 క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.
MacBook Air: ఫీచర్స్
మ్యాక్ బుక్ ఎయిర్ ల్యాప్ టాప్ 13.6 ఇంచ్ మరియు 15.3 ఇంచ్ లిక్విడ్ రెటినా స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ ల్యాప్ టాప్ (2560 x 1664) పిక్సెల్ రిజల్యూషన్, 500 నిట్స్ బ్రైట్‌నెస్ ట్రూ టోన్ మరియు P3 వైడ్ కలర్ గాముట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ లేటెస్ట్ మ్యాక్ బుక్ ఎయిర్ Apple M5 Chip తో లాంచ్ అయ్యింది.

ఇది 16-core Neural Engine మరియు 153GB/s మెమరీ బ్యాండ్ విడ్త్ తో వస్తుంది. ఇందులో H.264, HEVC, Pro Res మరియు ProRes RAW వంటి మీడియా ఇంజిన్ కూడా ఉన్నాయి. ఇది 16GB, 24GB మరియు 32GB యూనిఫైడ్ మెమరీ ఆప్షన్ తో వస్తుంది మరియు 512GB SSD నుంచి 1TB, 2TB మరియు 4TB వరకు స్టోరేజ్ ఆప్షన్ ఆకలిగా ఉంటుంది.
ఈ ల్యాప్ టాప్ డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వస్తే, ఇది అల్యూమినియం యూనిబాడీ డిజైన్ తో వస్తుంది. ఇందులో 53.8 వాట్ అవర్ లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంటుంది. ఇది 30W USB-C పవర్ అడాప్టర్ తో వస్తుంది మరియు 70W USB PD పవర్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో MagSafe 3 చార్జింగ్ పోర్ట్, 3.5 mm హెడ్ ఫోన్ జాక్, రెండు (USB-C) థన్ థండర్ బోల్ట్ 4 పోర్ట్, మరియు డిస్ప్లే పోర్ట్ కలిగి ఉంటుంది. ఇది 60Hz వద్ద 6K లేదా 144Hz 4K రిజల్యూషన్ తో రెండు డిస్ప్లే లకు సపోర్ట్ చేస్తుంది. అయితే, 60Hz 8K రిజల్యూషన్ వద్ద ఒక డిస్ప్లే కి సపోర్ట్ చేస్తుంది.
Also Read: కేవలం 8 వేల బడ్జెట్ లోనే 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!
ఈ ల్యాప్ టాప్ Dolby Vision, HDR10+, HDR10 మరియు HLG ఫార్మాట్ లతో పాటు HEVC, H.264, AV1 వంటి వీడియో ఫార్మాట్ లకు కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే, FLAC, డాల్బీ డిజిటల్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇందులో 4 స్పీకర్ ఆడియో సిస్టమ్ ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile