మీ Air Cooler నుంచి దుర్వాసన వస్తుందా.. పూర్తిగా నివారించడానికి బెస్ట్ టిప్స్.!

HIGHLIGHTS

సవికాలంలో Air Cooler మన ఇళ్లలో అత్యంత ఉపయోగకరమైన ఉపకరణం

కొన్నిసార్లు ఎయిర్ కూలర్ నుంచి మురికి నీటి వాసన లేదా చేపల కంపు లాంటి దుర్వాసన వస్తుంది

చిన్న టిప్స్ మరియు ట్రిక్స్ తో దుర్వాసన పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంది

మీ Air Cooler నుంచి దుర్వాసన వస్తుందా.. పూర్తిగా నివారించడానికి బెస్ట్ టిప్స్.!

తెలుగు రాష్టాల్లో ఇప్పటికే వేసవికాలం మొదలయినట్లు మనం ఫీల్ అవుతున్నాము. వేసవికాలంలో ఎయిర్‌ కూలర్ మన ఇళ్లలో అత్యంత ఉపయోగకరమైన ఉపకరణం అని అందరికీ తెలిసిన విషయం. అయితే, కొన్నిసార్లు ఎయిర్ కూలర్ నుంచి మురికి నీటి వాసన లేదా చేపల కంపు లాంటి దుర్వాసన వస్తుంది. ఇది ఎక్కువగా నీరు నిల్వ ఉండటం, బ్యాక్టీరియా పెరగడం, డస్ట్ చేయడం వంటివి కారణాల వలన జరుగుతుంది. అయితే, కొన్ని చిన్న చిన్న టిప్స్ మరియు ట్రిక్స్ తో ఆ వాసనను పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంది. ఈరోజు దీనికోసం ఉపయోగపడే టెక్నికల్ టిప్స్ తెలుసుకుందాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Air Cooler నుంచి దుర్వాసన ఎందుకు వస్తుంది?

ముందుగా, ఎయిర్ కూలర్ నుంచి దుర్వాసన రావడానికి ప్రధాన కారణాలు చూద్దాం. ఇందులో ముఖ్యంగా నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి.

  • ట్యాంక్‌ లో పాత నీరు నిల్వ ఉండటం
  • కూలింగ్ ప్యాడ్స్‌లో దుమ్ము లేదా ఫంగస్ చేరడం
  • హార్డ్ వాటర్ వల్ల ఖనిజాలు పేరుకుపోవడం
  • సరైన రీతిలో గాలి తగలక పోవడం (వెంటిలేషన్ లేకపోవడం)

కారణం ఏదైనా ఒక్కొక్కసారి తట్టుకోలేనంత దుర్వాసన కూలర్ నుంచి వస్తుంది. అలంటి సమయంలో కూలర్ అందించే చల్లని గాలి అందించే ఆనందం కంటే, కూలర్ నుంచి వచ్చే దుర్వాసన ఎక్కువ బాధను కలిగిస్తుంది.\

Air Cooler వాసన రాకుండా ఉండేందుకు బెస్ట్ టిప్స్

కూలర్ ఉపయోగించే వారు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, కూలర్ ట్యాంక్‌ లో నీరు ఎక్కువ రోజులు ఉంచితే బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే, ప్రతి 1 లేదా 2 రోజులకు నీటిని పూర్తిగా ఖాళీ చేసి తాజా నీరు నింపాలి. అలాగే, వారానికి ఒకసారి ట్యాంక్ ను పూర్తిగా ఖాళీ చేసి శుభ్రపరచాలి. అంటే, సబ్బు లేదా లిక్విడ్ డిటర్జెంట్‌ తో లోపలి భాగాలను శుభ్రం చేయాలి. మరింత క్లీన్ గా శుభ్రం చేయడానికి కొద్దిగా వెనిగర్ లేదా బ్లీచింగ్ పౌడర్ ఉపయోగిస్తే బ్యాక్టీరియా పూర్తిగా చనిపోతుంది.

Air Cooler

వాటర్ సేఫ్టీ కూడా కూలర్ నుంచి వాసన రాకుండా చేస్తుంది. అంటే, హార్డ్ వాటర్ వల్ల ట్యాంక్‌లో ఖనిజాలు పేరుకుపోయి వాసన వస్తుంది. అందుకే, సాధ్యమైనంత వరకు ఫిల్టర్ చేసిన నీరు లేదా RO నీరు వాడితే మంచిది. ఎయిర్‌ కూలర్ పని చేయడానికి క్రాస్ వెంటిలేషన్ అవసరం అవుతుంది. అందుకే, కూలర్‌ ను ఎప్పుడూ గాలి తగిలే చోట పెట్టాలి. ఒక కిటికీ లేదా తలుపు కొద్దిగా తెరిచి ఉంచడం మంచిది. అలా చేయకపోతే గది లోపల తేమ మరింత పెరిగి వాసన ఎక్కువ అవుతుంది.

Also Read: MacBook Air: పవర్ ఫుల్ M5 Chip తో కొత్త మ్యాక్ బుక్ ఎయిర్ లాంచ్ చేసిన ఆపిల్.!

ఇక అన్నింటి కన్నా సులభమైన మరియు ఈజీ టిప్ ఏమిటంటే, మార్కెట్లో దొరికే మంచి యాంటీ బాక్టీరియల్ లిక్విడ్ ను ఉపయోగించండి. ఇది బ్యాక్టీరియా అరికడుతుంది మరియు మంచి సువాసన కూడా ఇస్తుంది. అయితే, సరైన మోతాదులో మాత్రమే ఈ లిక్విడ్ ఉపయోగించాలని గుర్తుంచుకోండి.

వాస్తవానికి, ఎయిర్‌ కూలర్‌ లో దుర్వాసన రావడం అనేది సాధారణ సమస్యే. కానీ రెగ్యులర్ మెయింటెనెన్స్, శుభ్రపరచడం మరియు తాజా నీరు ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను పూర్తిగా నివారించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo