Redmi Note 17 Pro: షియోమీ కొత్త ఫోన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ తెలుసుకోండి.!
Redmi Note 17 Pro మరియు Pro Max రెండు ఫోన్స్ ని షియోమీ ఈరోజు విడుదల చేసింది
గొప్ప విజువల్స్ అందించే బిగ్ అండ్ పవర్ ఫుల్ స్క్రీన్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేసింది
ఈ ప్రైస్ లో చాలా ప్రీమియం ఫీచర్స్ ని ఈ ఫోన్ కలిగి ఉంటుంది
Redmi Note 17 Pro మరియు Pro Max రెండు ఫోన్స్ ని షియోమీ ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ ను 9,000 mAh బిగ్ బ్యాటరీ, గొప్ప విజువల్స్ అందించే బిగ్ అండ్ పవర్ ఫుల్ స్క్రీన్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ ప్రైస్ తో లెక్కిస్తే ఈ ఫోన్ లో డబ్బుకు తగిన విలువ ఇచ్చే ఫీచర్స్ తో పాటు నిరాశ పరిచే ఫీచర్స్ కూడా ఉన్నాయి. మరి ఈ రోజే సరికొత్తగా విడుదలైన ఈ షియోమీ కొత్త ఫోన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఏమిటో ఒక లుక్కేద్దామా.
SurveyRedmi Note 17 Pro: ప్రైస్
ముందుగా ఈ లేటెస్ట్ షియోమీ ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే, స్టార్టింగ్ వేరియంట్ 8GB + 128GB ని రూ. 36,999 ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 8GB + 256GB వేరియంట్ ను రూ. 39,999 ధార్తో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ క్లౌడ్ బ్లూ, పర్పల్ వైబ్ మరియు స్టెల్త్ బ్లాక్ మూడు రంగుల్లో లభిస్తుంది. సెప్టెంబర్ 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం అవుతుంది.

ఆఫర్స్
షియోమీ ఈ ఫోన్ పైన గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అదేమిటంటే, ఈ ఫోన్ పై SBI అండ్ ICICI క్రెడిట్ కార్డు రూ. 3,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఫోన్ కూడా అమెజాన్ మరియు షియోమీ అఫీషియల్ సైట్ నుంచి సేల్ అవుతుంది.
Also Read: Redmi Note 17 Pro Max ట్రిపుల్ చిప్ అండ్ 10000 mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది.!
Redmi Note 17 Pro: ఫీచర్స్
ఈ రెడ్ మీ నోట్ 17 ప్రో ఫోన్ కూడా మాక్స్ మాదిరిగా 6.83 ఇంచ్ బిగ్ అండ్ ఫ్లాట్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది 120Hz రిజల్యూషన్, 1.5K రిజల్యూషన్, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి. అయితే, ఈ ఫోన్ లో మాక్స్ మాదిరిగా HDR10 + మరియు డాల్బీ విజన్ సపోర్ట్ అందించలేదు. కానీ ఈ ప్రైస్ లో పవర్ ఫుల్ డిస్ప్లే ఈ ఫోన్ లో అందించింది.
ఈ ఫోన్ ను Snapdragon 6s Gen 4 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఇది కూడా 4nm ప్రాసెస్ టెక్నాలజీ తో పని చేసే చిప్ మరియు మంచి డైలీ యూసేజ్ పెర్ఫార్మన్స్ ఆఫర్ చేస్తుంది. అయితే, ఈ ఫోన్ లో LPDDR4x ర్యామ్ ని మాత్రమే అందించింది. ఇందులో 8GB ర్యామ్ + 8GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో పాటు 256GB హెవీ స్టోరేజ్ అందిస్తుంది.
ఈ ఫోన్ కెమెరా పరంగా నెగటివ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే, ఇందులో కేవలం FHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ మాత్రమే అందించింది. నిజానికి ఈ ప్రైస్ లో 4k వీడియో రికార్డింగ్ సపోర్ట్ లేకపోవడం చాలా నిరాశ కలిగించే విషయం అవుతుంది. ఈ ఫోన్ వెనుక 50MP + 8MP డ్యూయల్ రియర్ మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ రెండు కెమెరాలు 30FPS వద్ద FHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ మాత్రమే కలిగి ఉంటాయి. అయితే, అండర్ వాటర్ మోడ్, HDR సపోర్ట్ మరియు ఏఐ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.
బ్యాటరీ విభాగంలో చాలా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, షియోమీ ఈ ఫోన్ ని భారీ 9,000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో అందించింది. అలాగే, 67W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 22.5 W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఆఫర్ చేసింది. 300% వాల్యూమ్ బూస్ట్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ లో కూడా Dolby Atmos మరియు Hi-Res వంటి ప్రీమియం ఫీచర్ కూడా అందించింది. ఈ ఫోన్ కూడా IP66, IP68, IP69 మరియు IP69K డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తో లాంచ్ అయ్యింది.
ఈ ప్రైస్ లో చాలా ప్రీమియం ఫీచర్స్ ని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, బిగ్ బ్యాటరీ, పవర్ ఫుల్ చిప్ సెట్, గొప్ప డ్యూరబుల్ డిజైన్ మరియు గుడ్ డిస్ప్లే ఈ ఫోన్ లో ప్లస్ అవుతాయి. ఈ ఫోన్ కెమెరా పరంగా నిరుత్సాహ పరుస్తుంది. ప్రైస్ లో ఈ ఫోన్ కలిగిన కెమెరాని 4k తో అందించి ఉంటే బాగుండేదని, మార్కెట్ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
