Jio Best Plans: అతి చవక ధరలో జియో బెస్ట్ ప్లాన్స్ కోసం చూస్తుంటే ఒక లుక్కేయండి.!
కొత్తగా టెలీకామ్ కంపెనీలకు ట్రాయ్ అందించిన ఆదేశాల అనుసారం కూడా Jio ప్లాన్లను అందించింది
అతి చౌక ధరలో యూజర్లకు మంచి బెనిఫిట్స్ అందించే ప్లాన్లు కూడా కొన్ని ఉన్నాయి
యో యూజర్లకు మంచి బెనిఫిట్స్ అందిస్తున్న మరియు పరిగణలోకి తీసుకోదగిన బెస్ట్ ప్లాన్స్
Jio Best Plans: రిలయన్స్ జియో యూజర్ల కోసం అన్ని బడ్జెట్లో కూడా సరసమైన మరియు మంచి బెనిఫిట్స్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్లను అందించింది. కొత్తగా టెలీకామ్ కంపెనీలకు ట్రాయ్ అందించిన ఆదేశాల అనుసారం కూడా ప్లాన్లను అందించింది. వీటన్నిటిలో అతి చౌక ధరలో యూజర్లకు మంచి బెనిఫిట్స్ అందించే ప్లాన్లు కూడా కొన్ని ఉన్నాయి. మరి జియో యూజర్లకు మంచి బెనిఫిట్స్ అందిస్తున్న మరియు పరిగణలోకి తీసుకోదగిన బెస్ట్ ప్లాన్స్ ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.
SurveyJio Best Plans: ఏమిటా ప్లాన్స్
రిలయన్స్ జియో తన యూజర్ల కోసం అనేకమైన ప్రీపెయిడ్ ప్లాన్లను అందించింది. వీటిలో బెస్ట్ అన్లిమిటెడ్ వన్ మంత్ ప్రీపెయిడ్ ప్లాన్ గా రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్ చెప్పబడుతుంది. ఈ ప్లాన్ 28 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు చెల్లుబాటు కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5G డేటా మరియు రోజుకు 100 SMS బెనిఫిట్స్ ప్రయోజనం అందిస్తుంది.
ఇవి కాకుండా, 4జి నెట్ వర్క్ పైన డైలీ 2 జీబీ హై స్పీడ్ డేటా, గూగుల్ జెమినీ ప్రో, జియో హాట్ స్టార్ OTT యాక్సెస్ మరియు జియో ఏఐ క్లౌడ్ యాక్సెస్ లను ఉచితంగా అందిస్తుంది.
Also Read: Amazon GIF Sale: సాధారణ 55 ఇంచ్ టీవీ రేటుకే Samsung Mini LED స్మార్ట్ టీవీ సేల్ చేస్తోంది.!
రెండోది జియో అందించిన బడ్జెట్ మూడు నెలల లాంగ్ వ్యాలిడిటీ రూ. 899 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్. జియో ఆఫర్ చేస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే 90 రోజులు అన్లిమిటెడ్ 5జి డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS బెనిఫిట్స్ అందిస్తుంది. అదనంగా, డైలీ 2జీబీ 4జి డేటా మరియు 20 GB అదనపు డేటాతో పాటు జియో హాట్ స్టార్ OTT అండ్ గూగుల్ జెమినీ ప్రో యాక్సెస్ కూడా ఉచితంగా అందిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
