Amazon GIF Sale: సాధారణ 55 ఇంచ్ టీవీ రేటుకే Samsung Mini LED స్మార్ట్ టీవీ సేల్ చేస్తోంది.!
Amazon GIF Sale ఈరోజు రెండో రోజుకు చేరుకుంది
ఈ బిగ్ పండుగ సేల్ నుంచి ఈరోజు కూడా జబర్దస్త్ ఆఫర్స్ ప్రకటించింది
సాధారణ 55 ఇంచ్ టీవీ రేటుకే Samsung Mini LED స్మార్ట్ టీవీ అందుకోండి
Amazon GIF Sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు రెండో రోజుకు చేరుకుంది. 2026 దసరా పండుగ సందర్భంగా అమెజాన్ తీసుకొచ్చిన ఈ బిగ్ పండుగ సేల్ నుంచి ఈరోజు కూడా జబర్దస్త్ ఆఫర్స్ ప్రకటించింది. ఇంటికి తగిన బిగ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారి కోసం ఈరోజు జబర్దస్త్ డీల్స్ అందించింది. ఈ డీల్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, సాధారణ 55 ఇంచ్ టీవీ రేటుకే Samsung Mini LED స్మార్ట్ టీవీ అమెజాన్ ఆఫర్ చేస్తోంది.
SurveyAmazon GIF Sale: Samsung Mini LED స్మార్ట్ టీవీ డీల్
ఈ సంవత్సరం ప్రారంభంలో శాంసంగ్ ఇండియన్ మార్కెట్లో సరికొత్తగా విడుదల చేసిన మినీ ఎల్ఈడి 4K Vision AI 2026 స్మార్ట్ టీవీని అమెజాన్ ఈరోజు బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ తో చాలా చవక ధరలో సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీని ఈరోజు 23% డిస్కౌంట్ తో రూ. 45,990 ప్రైస్ తో లిస్ట్ చేసిన అమెజాన్, ఈ స్మార్ట్ టీవీ పై మరో రెండు బిగ్ డీల్స్ కూడా అందించింది.

డీల్స్ విషయానికి వస్తే, ఈ టీవీపై రూ. 2,550 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 1,500 రూపాయల భారీ SBI బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ అమెజాన్ సేల్ నుంచి కేవలం రూ. 41,940 రూపాయల అతి తక్కువ ధరలో మీకు లభిస్తుంది. అఫర్ ప్రైస్ చెక్ చేయడానికి మరియు ఈ టీవీని కొనుగోలు చేయడానికి Buy From Here పైన నొక్కండి.
Also Read: JBL 5.1 Dolby Atmos సౌండ్ బార్ ని సగం ధరకే అందుకోండి .. ఎక్కడంటే.!
Samsung Mini LED స్మార్ట్ టీవీ : ఫీచర్స్
ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ పరిమాణం కలిగిన మినీ ఎల్ఈడి HDR ప్యానల్ ని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్, ప్యూర్ స్పెక్ట్రమ్ కలర్, సుప్రీం మినీ ఎల్ఈడి డిమ్మింగ్, కాంట్రాస్ట్ ఎన్ హెన్సర్, 4K అప్ స్కేలింగ్ కలర్ బూస్టర్ మరియు HDR 10+ వంటి ఫీచర్స్ తో ఆకట్టుకునే మరియు అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది. మినీ ఎల్ఈడి ప్రాసెసర్ 4K తో పని చేస్తుంది. ఇది ల్యాగ్ ఫ్రీ మరియు వేగవంతమైన పెర్ఫార్మెన్స్ ఈ టీవీకి అందిస్తుంది.
ఇక సౌండ్ పరంగా, ఈ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 30W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ Q-Symphony, అడాప్టివ్ సౌండ్ మరియు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్ వంటి ఫీచర్స్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఇందులో 3 HDMI, 1 USB-A, LAN, ఆప్టికల్ అవుట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
