Redmi Note 17 Pro Max ట్రిపుల్ చిప్ అండ్ 10000 mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

Redmi Note 17 Pro Max స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది

ఈ ఫోన్ ను ట్రిపుల్ చిప్ అండ్ 10000 mAh బ్యాటరీతో లాంచ్ చేసింది

ఈ ఫోన్ పై రూ. 5,000 రూపాయల భారీ లాంచ్ ఆఫర్ కూడా ప్రకటించింది

Redmi Note 17 Pro Max ట్రిపుల్ చిప్ అండ్ 10000 mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది.!

Redmi Note 17 Pro Max స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను ట్రిపుల్ చిప్ అండ్ 10000 mAh బ్యాటరీతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను ఎవరూ ఊహించని ప్రీమియం ధరలో విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్ తన ప్రీమియం ఫీచర్స్ ఆకట్టుకుంటుంది. షియోమీ సరికొత్తగా విడుదల చేసిన ఈ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi Note 17 Pro Max : ప్రైస్

షియోమీ ఈ స్మార్ట్ ఫోన్ బేసిక్ 8GB + 256GB వేరియంట్ ని రూ. 49,999 ధరతో విడుదల చేసింది. అలాగే, ఈ ఫోన్ హై ఎండ్ 12GB + 256GB వేరియంట్ ని రూ. 54,999 ప్రైస్ ట్యాగ్ తో అందించింది. ఈ ఫోన్ ను సీక్రెట్ సన్ రైజ్, మచ్చా గ్రీన్ మరియు స్టెల్త్ బ్లాక్ మూడు రంగుల్లో లాంచ్ చేసింది.

Redmi Note 17 Pro Max price and features

సేల్ అండ్ ఆఫర్స్

ఈ ఫోన్ మొదటి సేల్ సెప్టెంబర్ 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. లాంచ్ లో భాగంగా షియోమీ ఈ ఫోన్ పై రూ. 5,000 రూపాయల SBI అండ్ Axis క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ ఫోన్ అమెజాన్ ఇది మరియు కంపెనీ అధికారిక సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Redmi Note 17 Pro Max : ఫీచర్స్

రెడ్ మీ నోట్ 17 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ ను 6.83 ఇంచ్ బిగ్ అండ్ ఫ్లాట్ AMOLED స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 120Hz రిజల్యూషన్, 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్స్ తో అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్ HDR10 + మరియు Dolby Vision సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ ను ట్రిపుల్ చిప్ పవర్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను Snapdragon 6 Gen 5 మెయిన్ చిప్ జతగా డ్యూయల్ సర్జ్ P3 మరియు సర్జ్ G2 చిప్ తో అందించింది. ఈ ఫోన్ కలిగిన మైన్ చిప్ 4nm ప్రాసెస్ టెక్నాలజీ తో పని చేస్తుంది మరియు మంచి పెర్ఫార్మన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ లో 12GB LPDDR5x ర్యామ్ మరియు 12GB వర్చువల్ ర్యామ్ జతగా 256GB హెవీ స్టోరేజ్ తో లాంచ్ చేసింది.

Redmi Note 17 Pro Max features

ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 50MP + 8MP డ్యూయల్ రియర్ మరియు 32MP సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ లో ఉన్నాయి. ఇది 30FPS వద్ద వీడియో రికార్డింగ్ చేసే సత్తా కలిగి ఉంటుంది. అంతేకాదు, అండర్ వాటర్ మోడ్, 2x అల్ట్రా క్లియర్ జూమ్ మరియు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 400% వాల్యూమ్ బూస్ట్ మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ కూడా ఉంది.

Also Read: Oppo K14 Lite లాంచ్ కంటే ముందే Sale డేట్ అనౌన్స్ చేసిన ఒప్పో .. ఫోన్ ఎలా ఉందంటే.!

బ్యాటరీ పరంగా, ఈ ఫోన్ లో 10,000 mAh హెవీ సిలికాన్ బ్యాటరీ ఉంది. మరి ఈ ఫోన్ కలిగిన పెద్ద బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయాలంటే చాలా వేగవంతమైన ఛార్జ్ సపోర్ట్ కూడా కావాలి కదా, అందుకే 100W ఫాస్ట్ చార్ సపోర్ట్ అందించింది. ఇది కాకుండా 27W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా ఈ ఫోన్ లో అందించింది.

ఈ ఫోన్ ముందు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 గ్లాస్ మరియు వెనుక గొప్ప మన్నికైన ఫైబర్ గ్లాస్ బ్యాక్ ప్యానల్ తో చాలా స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్ సెటప్ తో వస్తుంది. ఇది ఈ ఫోన్ ను గొప్ప డ్యూరబుల్ ఫోన్ గా మారుస్తుంది. అలాగే, ఈ ఫోన్ IP66, IP68, IP69 మరియు IP69K తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile