OnePlus N6 Lite లాంచ్ డేట్ వచ్చేసింది.. బిగ్ బ్యాటరీ మరియు డ్యూరబుల్ డిజైన్ తో వస్తుంది.!

HIGHLIGHTS

కొన్ని రోజులుగా ‘కమింగ్ సూన్’ క్యాప్షన్ తో మాత్రమే టీజింగ్ చేసిన వన్ ప్లస్

ఈ రోజు OnePlus N6 Lite ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది

ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ బిగ్ బ్యాటరీ మరియు డ్యూరబుల్ డిజైన్ తో వస్తుంది

OnePlus N6 Lite లాంచ్ డేట్ వచ్చేసింది.. బిగ్ బ్యాటరీ మరియు డ్యూరబుల్ డిజైన్ తో వస్తుంది.!

OnePlus N6 Lite స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం గత కొన్ని రోజులుగా ‘కమింగ్ సూన్’ క్యాప్షన్ తో మాత్రమే టీజింగ్ చేసిన వన్ ప్లస్, ఈ రోజు ఈ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. కేవలం ఈ ఫోన్ లాంచ్ డేట్ మాత్రమే కాదు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ సైతం ఈరోజు రివీల్ చేసింది. ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ బిగ్ బ్యాటరీ మరియు డ్యూరబుల్ డిజైన్ తో వస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus N6 Lite ఎప్పుడు లాంచ్ అవుతుంది?

వన్ ప్లస్ ఎన్ 6 లైట్ స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయబోతున్నట్లు వన్ ప్లస్ డేట్ అండ్ టైం కన్ఫర్మ్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ ఇండియా ద్వారా టీజింగ్ చేసింది. కాబట్టి, ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇది ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా రివీల్ చేసింది.

OnePlus N6 Lite : కీలక ఫీచర్స్

వన్ ప్లస్ ఎన్ 6 లైట్ స్మార్ట్ ఫోన్ ను మిలటరీ గ్రేడ్ డ్యూరబుల్ ఫీచర్ లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ MIL- 810H సర్టిఫికేషన్ తో ఉంటుంది. ఇది క్రింద పడినా కూడా ఆ షాక్ ను తట్టుకొనే విధంగా ఉంటుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, అనుకోకుండా ఫోన్ జారిపడినా తట్టుకునే శక్తి కలిగి ఉంటుందని వన్ ప్లస్ చెబుతోంది. అయితే, ఎంత ఎత్తు నుంచి పడితే షాక్ తట్టుకుంటుందని క్లియర్ గా తెలియ చేయలేదు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile