Realme C83 5G: టాప్ ఫీచర్స్ విడుదల చేసిన కంపెనీ.. బడ్జెట్ ఫోన్ ఫీచర్స్ అదుర్స్.!
Realme C83 5G ఫోన్ కలిగిన టాప్ ఫీచర్లు రివీల్ చేసింది
ఈ ఫోన్ బడ్జెట్ ధరలో అదిరే ఫీచర్స్ తో విడుదల కాబోతున్నట్లు అనిపిస్తుంది
ఈ ఫోన్ ను చూడ ముచ్చటైన డిజైన్ లో లాంచ్ చేస్తున్నట్లు టీజర్ ఇమేజెస్ చెబుతున్నాయి
Realme C83 5G: రియల్‌మీ అప్ కమింగ్ బడ్జెట్ సిరీస్ స్మార్ట్ ఫోన్ లంచ్ డేట్ ముందుగా అనౌన్స్ చేసిన కంపెనీ, ఇప్పుడు ఈ ఫోన్ కలిగిన టాప్ ఫీచర్లు కూడా రివీల్ చేసింది. కంపెనీ కొత్తగా రివిల్ చేసిన ఈ ఫోన్ కీలక ఫీచర్లు చూస్తుంటే ఈ ఫోన్ బడ్జెట్ ధరలో అదిరే ఫీచర్స్ తో విడుదల కాబోతున్నట్లు అనిపిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను చూడ ముచ్చటైన డిజైన్ లో లాంచ్ చేస్తున్నట్లు ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ చూస్తుంటే కూడా క్లియర్ అవుతుంది.
SurveyRealme C83 5G: లాంచ్ డేట్ ఏమిటి?
7 మార్చి 2026 తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తున్న రియల్‌మీ అనౌన్స్ చేసింది.
Realme C83 5G: టాప్ ఫీచర్స్
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కలిగిన ప్రధాన ఫీచర్స్ ను కంపెనీ ఇప్పటికే బయటకు వెల్లడించింది. చేతిలోంచి జారి పడినా తట్టుకునే ఆర్మర్ షెల్ ప్రొటక్షన్ తో మిలటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ డిజైన్ తో ఈ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ ను స్మూత్ ఎక్స్ పీరియన్స్ అందించే 144Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే తో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ వెల్లడించింది. ఇది 6.8 ఇంచ్ పరిమాణం కలిగిన HD+ LCD డిస్‌ప్లే కావచ్చని లీక్స్ చెబుతున్నాయి.
ఇక ఈ ఫోన్ కలిగిన చిప్ సెట్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ఎంట్రీ లెవల్ 5G అనుభవం అందించే మీడియాటెక్ Dimensity 6300 5జి చిప్ సెట్ తో లాంచ్ చేస్తుంది. ఈ చిప్ సెట్ 5 లక్షల 50 కంటే అధిక AnTuTu స్కోర్ అందిస్తుంది మరియు AI Boost తో వస్తుంది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే పెద్ద ఎయిర్ ఫ్లో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కూడా ఉంటుంది.

ఈ ఫోన్ లో వెనుక 12MP AI డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ఏఐ మోషన్ ఫోటో, డ్యూయల్ వ్యూ వీడియో మోడ్ మరియు ఏఐ స్మార్ట్ ఇమేజ్ మాట్టింగ్ వంటి అదనపు ఏఐ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బ్యాటరీ అండ్ చార్జ్ ఫీచర్స్ గురించి కంపెనీ ఎక్కువగా చెబుతోంది.
ఎందుకంటే, ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో 7000 mAh భారీ టైటాన్ బ్యాటరీతో లాంచ్ చేస్తోంది. అంతేకాదు, ఈ బిగ్ బ్యాటరీ కోసం ఫాస్ట్ ఛార్జ్ మరియు ఈ ఫోన్ బ్యాటరీతో ఇతర డివైజెస్ ఛార్జ్ చేసే ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ కూడా ఇందులో అందించింది. ఇదికాకుండా ఛార్జ్ చేసేటప్పుడు కూడా ఫోన్ ను ఉపయోగించేలా బైపాస్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఇందులో అందించింది. ఈ ఫోన్ IP64 రేటింగ్ తో వస్తుంది మరియు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
Also Read: iQOO 15R sale భారీ ఆఫర్లు మరియు డీల్స్ తో స్టార్ట్ అయ్యింది.!
రియల్‌మీ సి83 5జి : అంచనా ప్రైస్
రియల్‌మీ సి83 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో కేవలం రూ. 13,499 ప్రారంభ ధరలో కావచ్చని కొన్ని లీక్స్ చెబుతున్నాయి. అయితే, కంపెనీ ఈ ఫోన్ ప్రైస్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు మనం ఈ విషయాన్ని ద్రువీకరించలేము.