Ambrane PowerHub 300: ఫ్రిడ్జ్ కు సైతం 6 గంటలు పవర్ ఇవ్వగల పవర్ హబ్ లాంఛ్.!

HIGHLIGHTS

అంబ్రేన్ PowerHub 300 పవర్ హౌస్ ను లాంఛ్ చేసింది

ఈ పవర్ హౌస్ చిన్నసైజు ఫ్రిడ్జ్ కు సైతం 6 గంటలు పవర్ ఇస్తుంది

ఈ పవర్ హౌస్ తో ఫ్యాన్ తో సహా చాలా ప్రోడక్ట్స్ ను ఎక్కువ సమయం నడిపించవచ్చు

Ambrane PowerHub 300: ఫ్రిడ్జ్ కు సైతం 6 గంటలు పవర్ ఇవ్వగల పవర్ హబ్ లాంఛ్.!

Ambrane PowerHub 300: ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అంబ్రేన్, కరెంట్ కోతలతో సతమవుతున్న వారి కోసం కొత్త పవర్‌హబ్ 300 పవర్ హౌస్ ను లాంఛ్ చేసింది. ఈ కొత్త పవర్ హౌస్ చిన్నసైజు ఫ్రిడ్జ్ కు సైతం 6 గంటలు పవర్ ఇవ్వగలదని కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ పవర్ హౌస్ తో ఫ్యాన్ తో సహా చాలా ప్రోడక్ట్స్ ను ఎక్కువ సమయం నడిపించవచ్చని కూడా తెలిపింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Ambrane PowerHub 300

అంబ్రేన్ నిన్న ఇండియన్ మార్కెట్ లో సరికొత్త ప్రోడక్ట్స్ విడుదల చేసింది. అదే, అంబ్రేన్ పవర్‌హబ్ 300 ని ప్రోడక్ట్స్ మరియు ఈ ప్రోడక్ట్స్ తో స్మార్ట్ ఫోన్ లు, ల్యాప్ టాప్ లు, మినీ – ఫ్రిడ్జ్ లు, TV లు, స్పీకర్లు, మినీ ఫ్యాన్ మరియు మరిన్ని వస్తువులను నడిపించవచ్చు. ఈ ప్రొడక్ట్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఈ పవర్ హౌస్ 90,000mAh బ్యాటరీతో కేవలం 2.6kgs బరువు మాత్రమే ఉంటుంది.

Ambrane PowerHub 300
Ambrane PowerHub 300

ఈ పవర్ హబ్ 90,000mAh బిగ్ బ్యాటరీతో 300W output ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ పవర్ హౌస్ ఎమెర్జెనీ సంయమలో పని చేసే LED/SOS టార్చ్ మరియు 8 పవర్ ఫుల్ అవుట్ పుట్ లతో కూడా వస్తుంది. కేవలం ఇండోర్ మాత్రమే కాదు, ఈ ప్రోడక్ట్ ను అవుట్ డోర్ లలో కూడా ఉపయోగించేలా తీసుకు వచ్చునట్లు తెలిపింది.

Also Read: ట్రాన్స్పరెంట్ TWS Earbuds ను విడుదల చేసిన Promate బ్రాండ్.!

ఇక ఈ పావుర హబ్ లో అందించిన అవుట్ పుట్ ల విషయానికి వస్తే, ఇందులో AC, USB-A, round DC, cigarette lighter మరియు Type-C సపోర్ట్ తో అందించింది. అంతేకాదు, ఈ పవర్ హబ్ తో ఒకేసారి 8 డివైజ్ లను ఛార్జ్ చేయవచ్చని కూడా అంబ్రేన్ పేర్కొంది. ఈ పవర్ హబ్ ను 60W ఇన్ పుట్ తో వస్తుంది మరియు ఇది పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 6 గంటల సమయం తీసుకుంటుంది.

ఇక ఈ అంబ్రేన్ పవర్‌హబ్ 300 సేఫ్టీ ఫీచర్స్ గురించి చూస్తే, ఇది ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ మరియు టెంపరేచర్ రెసిస్టెంట్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. ఈ పవర్ హౌస్ BIS certification తో వస్తుంది మరియు 800+ lifecycles అందిస్తుందని కంపెనీ తెలిపింది.

Ambrane PowerHub 300: Price

అంబ్రేన్ పవర్‌హబ్ 300 పవర్ హౌస్ ని Rs. 21,999/- ధరతో విడుదల చేసింది. ఈ పవర్ హౌస్ ను Flipkart, Amazon మరియు Ambrane అధికారిక వెబ్సైట్ నుండి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo