BSNL Offer: రేపటితో ముగియనున్న సూపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి.!
బిఎస్ఎన్ఎల్ రీసెంట్ గా ఒక బెస్ట్ ఆఫర్ ని అందించింది
ఆఫర్ తో యూజర్లకు 15 రోజుల అదనపు వ్యాలిడిటీ ఉచితంగా లభిస్తుంది
ఈ ఆఫర్ రేపు ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది
BSNL Offer: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ఎప్పటికప్పుడు కొత్త ఉచిత ఆఫర్స్ తో తన యూజర్లను సంతోష పెడుతోంది. ఇప్పటికే అనేక బడ్జెట్ ప్లాన్లను అందించిన బిఎస్ఎన్ఎల్, రీసెంట్ గా ఒక బెస్ట్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్ తో యూజర్లకు 15 రోజుల అదనపు వ్యాలిడిటీ ఉచితంగా లభిస్తుంది. ఆఫ్ కోర్స్, ఈ ఆఫర్ యూజర్లు అందరికీ కాదనుకోండి, కేవలం బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న వన్ ఇయర్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసిన యూజర్లకు మాత్రమే అందిస్తుంది. అయితే, ఈ ఆఫర్ రేపు ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరి ఈ బిఎస్ఎన్ఎల్ అందించిన ఆ ప్రీపెయిడ్ ప్లాన్ అఫర్ ఏమిటో, ఆ ప్లాన్ తో వచ్చే బెనిఫిట్స్ మరియు అదనపు ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి.
SurveyBSNL Offer: ఏమిటి ఈ ఆఫర్
చాలా కాలంగా బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం అందుబాటులో ఉంచిన వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2,399 పై 15 రోజుల అదనపు వ్యాలిడిటీ ఆఫర్ ని బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఈ ఆఫర్ ని చాలా రోజులుగా అందుబాటులో ఉంచింది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పైన అందించిన 15 రోజుల ఉచిత అదనపు వ్యాలిడిటీ ఆఫర్ ని రేపటితో క్లోజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.

అంటే, రేపటి వరకు ఈ రూ. 2,399 రూపాయల వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే వారికి మాత్రమే ఈ ఉచిత 15 డేస్ అదనపు వ్యాలిడిటీ లభిస్తుంది. మీరు కూడా వన్ ఇయర్ ప్లాన్ తో రీఛార్జ్ చేయాలని ఆలోచిస్తుంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే మీకు 15 రోజుల అదనపు వ్యాలిడిటీ లభిస్తుంది.
Also Read: ప్రీమియం Samsung Dolby Atmos సౌండ్ బార్ నమ్మశక్యం కాని ఆల్ టైం చవక ధరలో లభిస్తోంది.!
BSNL Offer: ప్లాన్ బెనిఫిట్స్
బిఎస్ఎన్ఎల్ రూ. 2,399 ప్రీపెయిడ్ ప్లాన్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఇది కొత్త ఆఫర్ తో 380 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 380 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందిస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 2 జీబీ హై స్పీడ్ డేటా మరియు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.
కేవలం ఇది మాత్రమే కాదు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో వచ్చే హై స్పీడ్ డేటా ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది. అయితే, రేపు రీచార్జ్ చేసే వారికి మాత్రమే 380 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అక్టోబర్ 16 నుంచి రీఛార్జ్ చేసే యూజర్లకు 365 రోజుల వ్యాలిడిటీ మాత్రమే లభిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
