Apple TV 4K: హోమ్ ఎంటర్టైన్మెంట్ కోసం కొత్త ఫీచర్స్ తో సరికొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసిన యాపిల్.!

HIGHLIGHTS

Apple TV 4K ని లేటెస్ట్ A19 చిప్‌ తో లాంచ్ చేసింది

ఈ యాపిల్ కొత్త ప్రోడక్ట్ విజువల్స్ కోసం చాలా ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది

అద్భుతమైన విజువల్స్ మరియు సౌండ్ అందించడానికి ప్రత్యేకంగా యాపిల్ టీవీ 4కె ని అందించింది

Apple TV 4K: హోమ్ ఎంటర్టైన్మెంట్ కోసం కొత్త ఫీచర్స్ తో సరికొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసిన యాపిల్.!

Apple TV 4K: యాపిల్ ఈరోజు హోమ్ ఎంటర్టైన్మెంట్ కోసం మూడు సరికొత్త ప్రోడక్ట్ లను లాంచ్ చేసింది. అద్భుతమైన విజువల్స్ మరియు సౌండ్ అందించడానికి ప్రత్యేకంగా యాపిల్ టీవీ 4కె ని అందించింది. లేటెస్ట్ ప్రోడక్ట్ ని హోమ్ ఎంటర్టైన్మెంట్ కోసం తగ్గిన అన్ని ఫీచర్స్ తో యాపిల్ అందించింది. యాపిల్ సరికొత్తగా విడుదల చేసిన ఈ యాపిల్ టీవీ 4k యొక్క ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Apple TV 4K: ప్రైస్ అండ్ సేల్

యాపిల్ టీవీ 4కె ని ఇండియన్ మార్కెట్లో రూ. 39,900 రూపాయల ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ప్రోడక్ట్ ఈరోజు నుంచి ప్రీ ఆర్డర్స్ కి అందుబాటులో ఉంది. నవంబర్ 13వ తేదీ నుంచి యాపిల్ టీవీ 4కె సేల్ స్టార్ట్ అవుతుంది.

Apple TV 4K: ఫీచర్స్

ఈ కొత్త కొత్త యాపిల్ టీవీ 4కె ని లేటెస్ట్ A19 చిప్‌ తో లాంచ్ చేసింది. యాపిల్ తెలిపిన వివరాల ప్రకారం, ఇది మునుపటి తరం మోడల్‌ తో పోలిస్తే CPU పెర్ఫార్మెన్స్ 50 శాతం వరకు వేగంగా ఉంటుంది మరియు GPU పెర్ఫార్మెన్స్ కూడా రెండు రెట్లు వరకు మెరుగ్గా ఉంటుంది. ఈ చిప్‌ లో ప్రత్యేక AV1 వీడియో డీకోడర్‌ ను కూడా జత చేశారు. దీని సహాయంతో వీడియో స్ట్రీమ్‌ సమర్థవంతంగా డీకోడ్ చేయడంలో సహాయపడుతుంది. తద్వారా తక్కువ బ్యాండ్‌ విడ్త్‌ తోనూ మెరుగైన స్ట్రీమింగ్ నాణ్యతను అందించే అవకాశం ఉంటుంది.

Apple TV 4K

ఈ కొత్త డివైజ్ లో చేసిన అత్యంత ముఖ్యమైన మార్పుల్లో ఒకటి Siri AI అని తడుముకోకుండా చెప్పవచ్చు. ఇది యాపిల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చేసిన కొత్త Siri. ఇది సినిమాలు, టీవీ షోలు వెతకడం మాత్రమే కాకుండా, వాటి గురించి అదనపు సమాచారం తెలుసుకోవడానికి కూడా యూజర్లకు సహాయపడుతుంది. అలాగే, ఇందులో అందించిన మూడు Far-field మైక్రోఫోన్ సెటప్ తో రిమోట్ చేతిలో లేకపోయినా కూడా జస్ట్ వాయిస్ కమాండ్ తో టీవీని నియంత్రించవచ్చు.

Also Read: యాపిల్ ఈరోజు Home View మరియు Home Pod Mini 2 రెండు కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది.!

ఈ యాపిల్ కొత్త ప్రోడక్ట్ విజువల్స్ కోసం చాలా ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో Dolby Vision, HDR 10, HDR 10+ మరియు HLG ఉంది. ఇది అద్భుతమైన విజువల్స్ ని అందిస్తుందని యాపిల్ తెలిపింది. కేవలం విజువల్స్ మాత్రమే కాదు, ఇది Dolby Digital Plus 7.1 సరౌండ్, Dolby Atmos మరియు FLAC వంటి ప్రీమియం సౌండ్ ఫీచర్స్ తో గొప్ప సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది.

ఇందులో HDMI 2.1, గిగా బిట్ ఈథర్నెట్, బ్లూటూత్ వెర్షన్ 6 మరియు Wi‑Fi 7 వంటి ప్రీమియం కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి అలాగే, రిమోట్ కోసం IR రిసీవర్ కూడా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile