Covid 19 Vaccine: సైడ్ ఎఫెక్ట్స్ గురించి నిజం చెప్పిన వ్యాక్సిన్ తయారీ కంపెనీ.!

Covid 19 Vaccine: సైడ్ ఎఫెక్ట్స్ గురించి నిజం చెప్పిన వ్యాక్సిన్ తయారీ కంపెనీ.!
HIGHLIGHTS

AstraZeneca కొత్త కథనంతో ఒక్కసారి వాతావరణం వేడెక్కింది

Covid 19 Vaccine తెచ్చిన కంపెనీ అందించిన కోర్టు డాకుమెంట్స్ లో కొత్త కధనం

AstraZeneca ఫార్మాసూటికల్ కంపెనీ కోవిడ్ వ్యాక్సిన్ అందించింది

Covid 19 Vaccine: ప్రపంచం మొత్తం కోవిడ్ 19 అల్లాడిన విషయం తలచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు జలదరిస్తుంది. అటువంటి సమయంలో అందరి కంటే ముందుగా యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ మరియు AstraZeneca ఫార్మాసూటికల్ కంపెనీ సంయుక్తంగా కోవిడ్ ను నిలువరించడానికి వ్యాక్సిన్ అందించింది. అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ను అందరికీ అందించడం లో కూడా సఫలమయ్యారు. అయితే, AstraZeneca కొత్త కథనంతో ఒక్కసారి వాతావరణం వేడెక్కింది.

Covid 19 Vaccine

కోవిడ్ 19 ని నిలువరించడానికి ఆస్ట్రాజెనికా ఫార్మాసూటికల్ కంపెనీ వ్యాక్సిన్ ను తీసుకొచ్చింది. ఈ వ్యాక్సిన్ ను కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విరివిగా ఉపయోగించారు. అయితే, 2021 లో ఈ వ్యాక్సిన్ ను తీసుకున్న తరువాత జమ్మి స్కాట్ అనే వ్యక్తి బ్రెయిన్ ఇంజురి కి గురయ్యారు. ఈ విషయం పైన తీవ్రంగా స్పందించిన జిమ్మీ స్కాట్, మొదటగా ఈ కంపెనీ పైన కేసు నమోదు చేశారు.

Covid 19 Vaccine
Covid 19 Vaccine

ఆ తర్వాత, ఇదే వ్యాక్సిన్ తో సమస్యలు ఎదుర్కొన్నట్లు అనేక మంది న్యాయ పోరాటం చేశారు. ఈ వ్యాక్సిన్ తో థ్రోంబోసిస్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్‌తో (TTS) అనే తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లు ఈ వ్యాక్సిన్ పై ఆరోపణలు ఉన్నాయి.

Also Read: Nothing Phone (2a) 5G: కొత్త కలర్ వేరియంట్ ప్రకటించిన నథింగ్.!

దీని వలన శరీరంలో రక్తం గడ్డ కట్టడం జరుగుతుంది. రక్తం గడ్డ కట్టకుండా చేసే ప్లేట్ లెట్స్ ఒక్కసారిగా పడిపోవడం లేదా విచక్షణా రహితంగా ప్రవర్తించడం ఇందుకు కారణం అవుతుంది.

ఇప్పటికి వరకు ఇది కేవలం ఆరోపణలు అని మాత్రమే కొట్టిపడేశారు. అయితే, కోర్టు డాక్యుమెంట్స్ లో ఇది నిజమే అని కంపెనీ ఒప్పుకున్నట్లు తెలిపింది. అయితే, ఇది కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది, అని కూడా తెలిపినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఆస్ట్రాజెనికా ఫార్మాసూటికల్ కంపెనీ కోవిషీల్డ్ మరియు వ్యాక్స్ జెవ్రియా వ్యాక్సిన్ ను అందించింది.

Tags:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo