Nothing Phone (2a) 5G: కొత్త కలర్ వేరియంట్ ప్రకటించిన నథింగ్.!

Nothing Phone (2a) 5G: కొత్త కలర్ వేరియంట్ ప్రకటించిన నథింగ్.!
HIGHLIGHTS

Nothing Phone (2a) 5G కొత్త కలర్ వేరియంట్ లాంచ్

బ్లూ కలర్ లో మెరిసి పోతున్న కొత్త వేరియంట్

ఈ ఫోన్ యొక్క మూడవ కలర్ ఆప్షన్ ను కూడా చేస్తున్నట్లు ప్రకటించింది

Nothing Phone (2a) 5G: ముందుగా ప్రీమియం ఫోన్లు మాత్రమే అందించిన నథింగ్ బ్రాండ్, నథింగ్ ఫోన్ (2a) 5G తో మిడ్ రేంజ్ లో కూడా అడుగుపెట్టింది. నథింగ్ ఫోన్ (2a) 5G ఫోన్ ను 25 వేల రూపాయల ఉప బడ్జెట్ లో తీసుకువచ్చి గొప్ప ‘సర్ప్రైజ్ ఇవ్వడమే కాకుండా, మంచి స్పందన కూడా అందుకుంది. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క కొత్త కలర్ వేరియంట్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Nothing Phone (2a) 5G New Colour Variant

నథింగ్ ఫోన్ (2a) 5G స్మార్ట్ ఫోన్ ఇప్పటి వరకు వైట్ మరియు బ్లాక్ రెండు కలర్ ఆప్షన్ లో మాత్రమే లభించింది. అయితే, కంపెనీ ఇప్పుడు ఈ ఫోన్ యొక్క మూడవ కలర్ ఆప్షన్ ను కూడా చేస్తున్నట్లు ప్రకటించింది. నథింగ్ ఫోన్ (2a) 5G బ్లూ కలర్ వేరియంట్ ను కొత్తగా తీసుకువస్తోంది.

ఈ ఫోన్ యొక్క కలర్ లో మాత్రమే మార్పు ఉంటుందే తప్ప స్పెక్స్, ఫీచర్స్ మరియు ధరలో ఎటువంటి మార్పు ఉండదని కూడా కంపెనీ తెలిపింది. Flipkart ఈ కొత్త కలర్ వేరియంట్ యొక్క సేల్ పేజ్ ను కూడా ఇప్పటికే జత చేసింది.

Also Read: Jio Best Plan: అతి తక్కువ ఖర్చుతో 90 రోజుల పాటు అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!

Nothing Phone (2a) 5G: Price

నథింగ్ ఫోన్ (2a) 5G స్మార్ట్ ఫోన్ రూ. 23,999 రూపాయల ప్రారంభ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ 8GB మరియు 12GB RAM వేరియంట్ లను 128GB మరియు 256GB స్టోరేజ్ లతో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ఎండ్ వేరియంట్ రూ. 27,999 రూపాయలకు లభిస్తుంది.

నథింగ్ ఫోన్ (2a) 5G : ప్రత్యేకతలు

నథింగ్ ఫోన్ (2a) 5G స్మార్ట్ ఫోన్ Dimensity 7200 Pro ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 12GB RAM + 8 GB RAM Booster తో టోటల్ 20GB ర్యామ్ ఫీచర్ తో మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ Nothing OS 2.5 సాఫ్ట్ వేర్ పైన Android 14 తో పని చేస్తుంది.

Nothing Phone (2a) 5G
Nothing Phone (2a) 5G

ఈ ఫోన్ లో వెనుక 50MP (OIS) + 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ కెమెరాలతో 4K వీడియోలు మరియు గొప్ప డీటెయిల్స్ తో ఫోటో లను షూట్ చేయవచ్చు. ఈ ఫోన్ లో 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందించే 6.7 ఇంచ్ Flexible AMOLED డిస్ప్లే వుంది. అలాగే, 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉన్నాయి.

Tags:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo