OPPO K14x 5G: ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్స్ తో ఇండియాలో లాంచ్ కోసం రెడీగా వుంది. ఈ ఫోన్ మార్కెట్ ను ఆకట్టుకునే 5 గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుందని ఒప్పో చెబుతోంది. ఈ ఫోన్ సరికొత్త డిజైన్ మరియు కలర్స్ లో కూడా లాంచ్ అవుతున్నట్లు కూడా ఒప్పో ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది. ఇది బడ్జెట్ సీరియస్ ఫోన్ కాబట్టి బడ్జెట్ యూజర్ల అంచనాలు ఈ ఫోన్ ఎక్కువగా ఉంటాయి. మరి ఒప్పో చెబుతున్న ఈ టాప్ 5 ఫీచర్స్ ఏమిటో చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
OPPO K14x 5G : లాంచ్ డేట్
ఒప్పో కె 14x స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఫ్లిప్ కార్ట్ నుంచి ప్రత్యేకంగా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఈ ఫోన్ ను చాలా స్లీక్ అండ్ స్లీక్ డిజైన్ లో అందిస్తుంది. ఈ ఫోన్ వెనుక ఆకట్టుకునే కెమెరా డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ ను ప్రిజం వయొలెట్ మరియు ఐస్ బ్లూ వంటి రెండు ఆకట్టుకునే రంగుల్లో లాంచ్ చేస్తుంది.
డిస్ప్లే
ఈ ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన స్మూత్ డిస్ప్లేని 1125 నిట్స్ అధిక బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే సెంటర్ పంచ్ హోల్ డిజైన్ కలిగి ఉంటుంది.
కెమెరా
ఈ ఫోన్ వెనుక డ్యూయల్ రియర్ మరియు ముందు పంచ్ హోల్స్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో, మంచి డిటైల్స్ అందించే 50MP మెయిన్ సెన్సార్ ఉంటుంది. ఇది AI కెమెరా ఫీచర్స్ తో గొప్ప ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుందని ఒప్పో చెబుతోంది.
బ్యాటరీ
ఒప్పో కె 14x స్మార్ట్ ఫోన్ కలిగిన బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్ గురించి కంపెనీ ఎక్కువగా చెబుతోంది. ఎందుకంటే, ఈ బడ్జెట్ ఫోన్ లో 6500 mAh బ్యాటరీ ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ మరింత వేగంగా ఛార్జ్ చేసే 45W Super VOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ లాంచ్ అయ్యే ప్రైస్ లో ఈ ఫీచర్ కలిగిన బెస్ట్ ఫోన్ ఇదే అవుతుందని ఒప్పో చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ ను కలర్ OS 15 తో లాంచ్ చేస్తుంది. ఇది స్మూత్ గా పని చేసే విదంగా డిజైన్ చేయబడిన యూజర్ ఇంటర్ఫేజ్. ఈ ఫోన్ ను నీటి తుంపర్లు మరియు డస్ట్ నుంచి రక్షణ ఇచ్చే IP 64 రేటింగ్ తో అందిస్తున్నట్లు ఒప్పొ వెల్లడించింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile