Apple iPhone 18 Pro Max ఫోన్ గురించి ఇప్పుడు నెట్టింట్లో లీక్స్ ఈ ఫోన్ పై భారీ అంచనాలు రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే, ఈ అప్ కమింగ్ ఐఫోన్ మరింత ఉన్నతమైన టెక్నాలాజి తో వ అవకాశం మెండుగా ఉన్నట్టు ఈ కొత్త లీక్స్ చెబుతున్నాయి. వీటిలో ముఖ్యంగా అండర్ డిస్ప్లే ఫేస్ ఐడి మరియు బిగ్ బ్యాటరీ వంటివి ఉన్నాయి. ఐఫోన్ బ్యాటరీ గురించి ఇప్పటి వరకు ఎన్నడూ లేని చర్చ ఇప్పుడు ఈ అప్ కమింగ్ ఫోన్ గురించి ఎక్కువగా వినిపిస్తోంది.
Survey
✅ Thank you for completing the survey!
Apple iPhone 18 Pro Max : లీక్డ్ ఫీచర్స్
యాపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఫోన్ ను సెప్టెంబర్ 2026 లో ఆవిష్కరించవచ్చు. అంటే, ఇప్పటి వరకు యాపిల్ ఫాలో అయిన ప్యాట్రన్ ను దృష్టిలో ఉంచుకుని ఈ అంచనా వేసి చెబుతున్నారు. ఇక లీక్డ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను యాపిల్ యొక్క అతి శక్తివంతమైన A20 Pro Chip తో లాంచ్ చేసే అవకాశం ఉందని కొత్త లీక్స్ చెబుతున్నాయి. ఇది 2nm టెక్నాలాజి చిప్ అవుతుంది మరియు ఇందులో వేగం మరియు బ్యాటరీ సామర్థ్యం రెండూ ఉంటాయని చెబుతున్నారు.
ఈ అప్ కమింగ్ యాపిల్ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ గురించి కూడా లీక్స్ వివరాలు వెల్లడించాయి. అవేమిటంటే, ఈ ఫోన్ లో డిస్ప్లే లోపల ఫేస్ ఐడి ఉంటుందట. దీని కారణంగా ఈ అప్ కమింగ్ ఐఫోన్ లో డైనమిక్ ఐల్యాండ్ చిన్నగా మారడం లేదా పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ లో 6.9 అంగుళాల పెద్ద OLED LTPO డిస్‌ప్లే ఉండే అవకాశం ఉందని కూడా లీక్స్ చెబుతున్నాయి.
ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఐఫోన్ 18 మాక్స్ ప్రో ఫోన్ లో 5,100mAh – 5,200mAh మధ్య పరిధిలో ఒక పెద్ద బ్యాటరీ ఉండొచ్చని కొన్ని లీక్స్ చెబుతున్నాయి. అంటే, ఈ అప్ కమింగ్ ప్రీమియం ఐఫోన్ లో బిగ్ బ్యాటరీ ఆశించవచ్చు. ఈ ఫోన్ లో కూడా ఎప్పటిలాగానే ట్రిపుల్ లెన్స్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈసారి మరింత పవర్ ఫుల్ కెమెరా లెన్స్ ఉపయోగించే అవకాశం ఉంది. ఈసారి DSLR మాదిరి హై లెవల్ ఫోటోగ్రఫీ కోసం వేరియబుల్ అపర్చర్ లెన్స్ లను ఉపయోగించే అవకాశం ఉందని లీక్స్ వెల్లడించాయి.
అయితే, ఇప్పటి వరకు మనం చర్చించుకున్న విషయాలు అన్ని కూడా యాపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ పై ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్న లీక్స్ మరియు అంచనా ఫీచర్స్ మాత్రమే సుమ. ఈ ఫోన్ గురించి ఎటువంటి అఫీషియల్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile