Ai+ Nova Tab: బడ్జెట్ ధరలో 5G ట్యాబ్ లాంచ్ అయ్యింది .. ప్రైస్ అండ్ ఫీచర్స్ చూద్దామా.!

HIGHLIGHTS

భారతీయ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఏఐ ప్లస్ మార్కెట్లో కొత్తగా బడ్జెట్ ట్యాబ్ ను లాంచ్ చేసింది

ఈ టాబ్లెట్ ను బడ్జెట్ 5జి సపోర్ట్ తో లాంచ్ చేయడం విశేషం

ఈ టాబ్లెట్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది

Ai+ Nova Tab: బడ్జెట్ ధరలో 5G ట్యాబ్ లాంచ్ అయ్యింది .. ప్రైస్ అండ్ ఫీచర్స్ చూద్దామా.!

Ai+ Nova Tab: భారతీయ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఏఐ ప్లస్ మార్కెట్లో కొత్తగా బడ్జెట్ ట్యాబ్ ను లాంచ్ చేసింది. ఈ టాబ్లెట్ ను బడ్జెట్ 5జి సపోర్ట్ తో లాంచ్ చేయడం విశేషం. స్మార్ట్ ఫోన్ రేట్లు భారీగా పెరుగుతున్న క్రమంలో మొబైల్ యూజర్లు ఎక్కువ పెద్ద స్క్రీన్ తో వచ్చే బడ్జెట్ ట్యాబ్ లపై దృష్టి సారిస్తున్నట్లు కొత్త లెక్కలు చెబుతున్నాయి. ఈ మార్కెట్ ట్రెండ్ ను ఒడిసి పట్టేలా ఈ కొత్త టాబ్లెట్ మార్కెట్ లో ప్రవేశపెట్టినట్లు అనిపిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Ai+ Nova Tab: ప్రైస్

ఈ టాబ్లెట్ ను కేవలం రూ. 19,999 ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ టాబ్లెట్ Wi-Fi + 5G సపోర్ట్ తో వస్తుంది. ఇక్కడ సూచించిన ధర 6 GB + 128 GB బేసిక్ వేరియంట్ ధర మరియు 8 GB + 128 GB హై ఎండ్ వేరియంట్ రూ. 21,999 లాంచ్ అయ్యింది. ఇది కాకుండా ఈ టాబ్లెట్ ను మరింత చవక ధరలో అందుకోవడానికి వీలుగా రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ని కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ టాబ్లెట్ కేవలం రూ. 18,999 రూపాయల చవక ధరలో లభిస్తుంది. ఈ టాబ్లెట్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Ai+ Nova Tab: ఫీచర్స్

ఏఐ ప్లస్ ఈ టాబ్లెట్ ని 11.97 ఇంచ్ బిగ్ స్క్రీన్ ను 90Hz రిఫ్రెష్ రేట్ తో స్మూత్ విజువల్స్ సపోర్ట్ తో అందించింది. ఈ ట్యాబ్ ను 2.2GHz స్పీడ్ కలిగిన Unisoc T760 5G చిప్ సెట్ తో అందించింది. ఇందులో 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ ఉంటుంది. ఈ టాబ్లెట్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OS తో nxtQ OS పై పని చేస్తుంది.

Ai+ Nova Tab

ఇందులో 13MP మెయిన్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది FHD వీడియో రికార్డింగ్ మరియు ఆకట్టుకునే ఇమేజ్ లను అందిస్తుంది. ఈ టాబ్లెట్ ను 8000 mAh భారీ బ్యాటరీతో అందించింది మరియు ఈ ట్యాబ్ ను వేగంగా ఛార్జ్ చేసే 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ని కూడా ఇందులో అందించింది. ఈ టాబ్లెట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టాబ్లెట్ తో పాటే ప్రొటెక్టింగ్ కేస్ ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.

Also Read: Mivi One 5G ఫస్ట్ సేల్ బిగ్ డీల్స్ మిస్ చేసుకోండి .. ఇది అతి చవక 5జి ఫోన్ గా వచ్చింది.!

బడ్జెట్ ధరలో కొత్త 5జి ట్యాబ్ కోసం చూసే యూజర్లు ఈ లేటెస్ట్ ట్యాబ్ ను పరిశీలించవచ్చు. అలాగే, ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మంచి డీల్స్ ను కూడా ఈ టాబ్లెట్ పైన అందుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile