Mivi One 5G ఫస్ట్ సేల్ బిగ్ డీల్స్ మిస్ చేసుకోండి .. ఇది అతి చవక 5జి ఫోన్ గా వచ్చింది.!
Mivi One 5G ఫస్ట్ సేల్ బిగ్ డీల్స్ మిస్ చేసుకోండి అని అంటోంది కంపెనీ.
ఫోన్ ఫస్ట్ సేల్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ముందస్తు సేల్ నుంచి ప్రారంభం అవుతుంది
ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ డే బిగ్ డీల్స్ తో మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది
Mivi One 5G ఫస్ట్ సేల్ బిగ్ డీల్స్ మిస్ చేసుకోండి అని అంటోంది కంపెనీ. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ముందస్తు యాక్సెస్ సేల్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ రీసెంట్ గా ఇండియాలో లాంచ్ అయ్యింది మరియు ప్రముఖ హైదరాబాద్ బెస్ట్ వేరబుల్ బ్రాండ్ మివి నుంచి వచ్చిన ఫాస్ట్ స్మార్ట్ ఫోన్ గా నిలిచింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ డే బిగ్ డీల్స్ తో మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది.
SurveyMivi One 5G ఫస్ట్ సేల్ బిగ్ డీల్స్
మివి ఈ ఫోన్ పై బిగ్ డీల్స్ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల ఫస్ట్ డే సేల్ కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 6,00 రూపాయల బ్యాంకు డిస్కౌంట్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 11,399 రూపాయల అతి చవక ధరలో అందుకోవచ్చు. ఈ బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ అందుకోవడానికి మీరు ఫ్లిప్ కార్ట్ Axis లేదా ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు ఉపయోగించాల్సి ఉంటుంది.

ఆఫర్స్ సరే అసలు ప్రైస్ ఏమిటి అని మీరు అనుకోవచ్చు, ఈ ఫోన్ ను మొత్తం మూడు వేరియంట్స్ లో మివి లాంచ్ చేసింది. ఇందులో బేసిక్ 4 జీబీ + 128 జీబీ వేరియంట్ ప్రైస్ రూ. 12,999, మిడ్ వేరియంట్ 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ప్రైస్ రూ. 14,999 మరియు హై ఎండ్ 8 జీబీ + 128 జీబీ వేరియంట్ ప్రైస్ రూ. 16,499 తో అందించింది. అయితే, పైన తెలిపిన ఆఫర్స్ తో ఈ ఫోన్ 16 రూపాయల తక్కువ ధరలో మీకు ఫస్ట్ సేల్ నుంచి లభిస్తుంది.
Also Read: Amazon GIF Sale నుంచి సగం రేటుకే 5.2 Dolby సౌండ్ బార్ అందుకోండి.!
Mivi One 5G : ఫీచర్స్
మివి ఈ ఫోన్ ను చాల ఆకట్టుకునే డిజైన్ మరియు ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈ ఫోన్ 6.75 ఇంచ్ HD+ స్క్రీన్ ను 120 Hz రిఫ్రెష్ రేటుతో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ బడ్జెట్ చిప్ సెట్ Snapdragon 4 Gen 2 తో పని చేస్తుంది. అలాగే, ఈ ఫోన్ లో 4 జీబీ, 6 జీబీ మరియు 8 జీబీ ర్యామ్ తో జతగా 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ని అందించింది. ఈ ఫోన్ బ్లోట్ వేర్ లేని ఆండ్రాయిడ్ 16 OS తో నడుస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 18 OS వరకు అప్డేట్స్ అందుకుంటుంది.
ఇక కెమెరా సెటప్ చూస్తే, ఈ ఫోన్ లో 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ FHD వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్ కలిగి ఉంటుంది. ఇందులో 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫోన్ తో పాటు వేగంగా చేసే ఫాస్ట్ ఛార్జర్ ను కూడా మివి అందిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
