ప్రీమియం 55 ఇంచ్ QLED Smart Tv ని అతి చవక ధరలో కోరుకుంటే .. ఈ డీల్ మీ కోసమే.!
ప్రీమియం 55 ఇంచ్ QLED Smart Tv ని అతి చవక ధరలో పొందండి
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ని అందించింది
ఈ టీవీ 3GB DDR4 RAM మరియు 64 జీబీ స్టోరేజ్ తో వస్తుంది
ప్రీమియం 55 ఇంచ్ QLED Smart Tv ని అతి చవక ధరలో కోరుకుంటే, ఈరోజు మీ కోసం ఒక జబర్దస్త్ డీల్ అందుబాటులో ఉంది. అమెజాన్ ఇండియా ఈరోజు నుంచి ప్రారంభించిన దసరా పండుగ సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ని అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఇండియాలో రిలీజ్ అయిన ప్రైస్ తో పోలిస్తే ఈరోజు చాలా చవక ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ప్రైస్, ఆఫర్స్ మరియు ఫీచర్లు ఏమిటో చూద్దామా.
SurveyQLED Smart Tv డీల్ ఏమిటి?
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది. ఈ సేల్ మొదటి రోజు భారీ డీల్స్ మరియు ఆఫర్స్ ప్రకటించింది. ఈ రోజు అందించిన డీల్స్ లో ఒక 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ చాలా గొప్పగా ఉంది. అదేమిటంటే, Lumio Vision 7 2026 కొత్త క్యూలెడ్ స్మార్ట్ టీవీని ఈరోజు అన్ని ఆఫర్స్ తో చాలా చవక ధరలో సేల్ చేస్తోంది.

ఈ స్మార్ట్ టీవీ ఇండియాలో రూ. 42,999 రూపాయల రెగ్యులర్ ప్రైస్ సేల్ అవుతుండగా, ఈ టీవీని రూ. 2,000 డిస్కౌంట్ తో రూ. 40,999 ధరతో అమెజాన్ సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ రోజు సేల్ నుంచి రూ. 1,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 2,500 రూపాయల SBI క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి కేవలం రూ. 37,499 రూపాయల డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చు. ఇది ఈ ప్రైస్ లో బెస్ట్ ఫీచర్స్ కలిగిన బెస్ట్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్ గా నిలుస్తుంది. ఆఫర్ ధరలో ఈ టీవీని కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Also Read: ఇది ఆఫర్ కాదు అద్భుతం: లేటెస్ట్ 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ సగం ధరకే లభిస్తోంది.!
Lumio 55 QLED Smart Tv : ఫీచర్స్
ఈ లుమియో స్మార్ట్ టీవీ 55 ఇంచ్ పరిమాణం కలిగిన క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ DOPE పిక్చర్ ఇంజిన్, 100% NTSC, HDR10, డాల్బీ విజన్ మరియు 4K HDR వంటి ప్రీమియం ఫీచర్స్ తో గోప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ BOSS ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఈ టీవీని వేగంగా మరియు ల్యాగ్ ఫ్రీ గా నడిపించడానికి 3GB DDR4 RAM ను ఈ టీవీలో అందించింది. ఇది కాకుండా ఎక్కువ యాప్స్ కోసం స్టాక్ చేయడానికి వీలుగా 64 జీబీ స్టోరేజ్ ని కూడా ఈ టీవిలో అందించింది.
ఈ స్మార్ట్ టీవీ 2 ట్వీటర్ + 2 ఫుల్ రేంజ్ స్పీకర్ తో క్వాడ్ స్పీకర్ సెటప్ ఉంది. ఈ టీవీ కలిగిన క్వాడ్ స్పీకర్ సెటప్ తో 30W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇది DGS సౌండ్, డాల్బీ అట్మోస్ మరియు డాల్బీ ఆడియో సౌండ్ టెక్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఇందులో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, ఈథర్నెట్, ఆప్టికల్ అవుట్, AV, బ్లూటూత్ మరియు అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
