Jio Best Plan: అతి తక్కువ ఖర్చుతో 90 రోజుల పాటు అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!

HIGHLIGHTS

జియో యూజర్లకు అధిక లాభాలను అందించే కొత్త లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ను అందించింది

2024 IPL సీజన్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ప్లాన్

ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేయడం ద్వారా 90 రోజుల పాటు అన్లిమిటెడ్ లాభాలను అందుకోవచ్చు

Jio Best Plan: అతి తక్కువ ఖర్చుతో 90 రోజుల పాటు అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!

Jio Best Plan: రిలయన్స్ జియో యూజర్లకు అధిక లాభాలను అందించే కొత్త లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ను అందించింది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేయడం ద్వారా 90 రోజుల పాటు అన్లిమిటెడ్ లాభాలను అందుకోవచ్చు. 2024 IPL సీజన్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ ప్లాన్ పైనన్ అందించే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Jio Best Plan

2024 IPL సీజన్ సందర్భంగా రిలయన్స్ జియో ఇటీవల సరికొత్తగా తీసుకొచ్చిన, రూ. 749 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం ఇప్పుడు చర్చించబోతోంది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను డేటా, కాలింగ్, SMS మరియు లాంగ్ వ్యాలిడిటీ వంటి అన్ని ప్రయోజనాలతో జియో అందించింది.

Jio Rs. 749 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో యొక్క ఈ Rs. 749 ప్రీపెయిడ్ ప్లాన్ ను క్రికెట్ ఆఫర్ లో భాగంగా తీసుకు వచ్చింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో 90 రోజుల పాటు ఆన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యాన్ని ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు పొందుతారు.

Jio Entertainment Plans
Jio Best Plan

ఈ ప్లాన్ తో 5G నెట్ వర్క్ పైన unlimited 5G డేటా లేదా 4G నెట్ వర్క్ పైన రోజు 2GB డేటా చొప్పున 180 GB డేటాని ప్యూతి వ్యాలిడిటీ కాలానికి అందుకుంటారు. అంతేకాదు, ఈ ప్లాన్ తో 20 GB అదనపు డేటాని కూడా జియో అందిస్తోంది. అంనంటే, ఈ ప్లాన్ తో 90 రోజులకు గాను పూర్తిగా 200 GB 4G డేటాని అందుకుంటారు.

Also Read: Ambrane PowerHub 300: ఫ్రిడ్జ్ కు సైతం 6 గంటలు పవర్ ఇవ్వగల పవర్ హబ్ లాంఛ్.!

ఇక ఈ ప్లాన్ అందించే మరిన్ని ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో రోజు 100 SMS ఉపయోగ ప్రయోజనం కూడా అంధిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో JioTV, JioCinema మరియు JioCloud లకు ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.

ఈ జియో బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, నెలకు ఖర్చుతోనే రూ. 250 రూపాయల ఖర్చుతో అన్లిమిటెడ్ లాభాలను అందుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo