Oppo Find X10: రెండు 200MP కెమెరాలతో 8K వీడియో సపోర్ట్ తో లాంచ్ అవుతోంది.!
ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఇప్పుడు మార్కెట్లో పెద్ద చర్చకు దారితీసింది
Oppo Find X10 స్మార్ట్ ఫోన్ గురించి కెమెరా గురించి ఒప్పో గొప్పగా చెబుతోంది
ఈ ఫోన్ రెండు 200MP కెమెరాలతో 8K వీడియో సపోర్ట్ తో లాంచ్ అవుతోందని ఒప్పో తెలిపింది
Oppo Find X10: ఒప్పో త్వరలో లాంచ్ చేయబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఇప్పుడు మార్కెట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అద్భుతమైన కెమెరా సెటప్ తో లాంచ్ కాబోతున్నట్లు ఒప్పో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది. సాధారణంగా ప్రీమియం ఫోన్ గొప్ప ఫీచర్లను కలిగి ఉండటం మనం ఊహిస్తాం. కానీ ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ బేసిక్ వేరియంట్ ఫైండ్ ఎక్స్ 10 స్మార్ట్ ఫోన్ కూడా ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ తెలపడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఫోన్ రెండు 200MP కెమెరాలతో 8K వీడియో సపోర్ట్ తో లాంచ్ అవుతోందని ఒప్పో తెలిపింది.
SurveyOppo Find X10: లాంచ్ డేట్
ఒప్పో ఫైండ్ ఎక్స్ 10 సిరీస్ ను అక్టోబర్ 22న ఇండియాలో లాంచ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ ఇండియాలో అక్టోబర్ 22న పరిచయం చేయబడుతుంది. ఈ ఫోన్ తో పాటు ఇదే సిరీస్ ప్రీమియం ఫోన్ ఫైండ్ ఎక్స్ 10 అల్ట్రా కూడా లాంచ్ అవుతుంది.
Oppo Find X10: కెమెరా సెటప్ ఏమిటి
ఒప్పో ఫైండ్ ఎక్స్ 10 స్మార్ట్ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200MP Hasselblad మెయిన్ కెమెరా, 200MP Hasselblad అల్ట్రా సెన్సింగ్ టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు నాల్గవ త్రు కలర్ కెమెరా ఉంటాయి. అంతేకాదు, ఈ కంప్లీట్ సెటప్ తో ఈ ఫోన్ లో నిజమైన రంగులు అందించే Luma కలర్ టెక్ కూడా అందించింది. ఈ ఫోన్ ఫీచర్స్ ని కూడా ఒప్పో టీజింగ్ చేసింది.

కెమెరా ప్రకారం, ఈ ఫోన్ కెమెరా 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 120 FPS తో 4K డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంది. అలాగే, 8K అల్ట్రా క్లియర్ ఫోటోలు, AI ఫోటో ఏజెంట్ మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ తో మరింత జూమ్ కోసం కొత్త టెలీ కన్వర్టర్ ని కూడా లాంచ్ చేస్తోంది. ఈ రెండింటి కలయికతో ఇది అత్యద్భుతమైన ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుందని ఒప్పో చెబుతోంది.
Also Read: Amazon GIF Sale నుంచి ఈరోజు రెండు 55 ఇంచ్ Mini LED స్మార్ట్ టీవీలు బెస్ట్ ప్రైస్ లో లభిస్తున్నాయి.!
పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది
ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ గురించి కూడా కంపెనీ ఒక ఐడియా ఇచ్చింది. అదేమిటంటే, ఒప్పో ఈ ఫోన్ ను 3nm టెక్నాలజీ తో నడిచే మీడియాటెక్ Dimensity 9600M చిప్ సెట్ తో ఈ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఇది ఈ ఫోన్ ను చాలా వేగంగా ఉంచుతుంది మరియు అద్భుతమైన కెమెరా క్యాపబిలిటీ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ కూడా లాంచ్ కంటే ముందే రివీల్ చేసే అవకాశం ఉంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
