BSNL Festival offer: దసరా పండుగ ధమాకా ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వ టెలికాం.!
బిఎస్ఎన్ఎల్ దేశ ప్రజల కోసం దసరా పండుగ ధమాకా ఆఫర్ ని ప్రకటించింది
BSNL Festival offer 24 రోజుల అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ని యూజర్లకు అందిస్తుంది
ఈ ఆఫర్ కోసం మీరు చేయాల్సింది అలా ఏమీ లేదు కేవలం ఒక్క రూపాయి చెల్లించి రీఛార్జీ చేస్తే సరిపోతుంది
BSNL Festival offer: ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ దేశ ప్రజల కోసం దసరా పండుగ ధమాకా ఆఫర్ ని ప్రకటించింది. ప్రతి ఒక్కరికి బిఎస్ఎన్ఎల్ 4జి కనెక్టివిటీని అందుబాటులో ఉంచే విధంగా ఈ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్ తో కేవలం ఒక్క రూపాయికే ఉచిత సిమ్ కార్డు మరియు 24 రోజుల అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ని యూజర్లకి అందిస్తుంది. ఈ ఆఫర్ కోసం మీరు చేయాల్సింది అలా ఏమీ లేదు కేవలం ఒక్క రూపాయి చెల్లించి రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. మరి ప్రభుత్వ టెలికాం బిఎస్ఎన్ఎల్ ప్రకటించిన దసరా పండుగ ధమాకా ఆఫర్ ఏమిటో చూద్దామా.
SurveyBSNL Festival offer: ఏమిటి ఈ ఆఫర్?
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) దేశ ప్రజల కోసం రూ. 1 ప్రీపెయిడ్ ప్లాన్ ని అనౌన్స్ చేసింది. అఫ్ కోర్స్, ఈ ఆఫర్ చాలా కాలంగా అందుబాటులో ఉన్నా కూడా రీసెంట్ గా ఈ ప్లాన్ ఆఫర్ ని రూ. 51 రూపాయి కి పెంచింది. అయితే, ఇప్పుడు ఈ ఆఫర్ ని మరలా రూ. 1 రూపాయికే ఇవ్వడం ప్రారంభించింది. ఈ ఆఫర్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు కేవలం 1 రూపాయికే 24 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందిస్తుంది.

అయితే, ఈ ఈ ఆఫర్ బిఎస్ఎన్ఎల్ యూజర్స్ అందరికీ అందుబాటులో ఉండదని మాత్రం మీరు గమనించాలి. ఎందుకంటే, ఈ ఆఫర్ కేవలం బిఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్ల కోసం మాత్రమే బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. అంటే, బిఎస్ఎన్ఎల్ యొక్క సిమ్ కార్డు తీసుకుని మొదటి రీఛార్జ్ ని ఈ ఒక్క రూపాయి ఆఫర్ తో రీఛార్జ్ చేసే వారికి మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది.
ఈ ఆఫర్ గడువు తేదీ ఏమిటి?
బిఎస్ఎన్ఎల్ ప్రకటించిన ఈ ఆఫర్ అక్టోబర్ 14వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది అయితే, ఈ ఒక్క రూపాయి ఆఫర్ నవంబర్ 9వ తేదీతో ముగుస్తుంది. అంటే, 2026 దసరా మరియు దీపావళి పండుగ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
Also Read: లేటెస్ట్ JBL 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ అద్భుతమైన డీల్స్ ప్రకటించింది.!
BSNL Festival offer: అందించే లాభాలు ఏమిటి?
బిఎస్ఎన్ఎల్ ఒక్క రూపాయి రీఛార్జ్ ఆఫర్ కేవలం కొత్త కస్టమర్ల కోసం మాత్రమే అందించింది. అంటే, బిఎస్ఎన్ఎల్ న్యూ సిమ్ కార్డు తీసుకుని ఫస్ట్ రీఛార్జ్ గా ఈ రూ. 1 ప్లాన్ ఎంచుకునే కొత్త యూజర్లకు ర్ ఆఫర్ వర్తిస్తుంది. ఈ రూ. 1 ఆఫర్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 24 రోజుల అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందిస్తుంది. అంటే, 24 రోజుల పాటు డైలీ 1 జీబీ వేగవంతమైన డేటాతో పాటు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం అందిస్తుంది. ఇది కాకుండా డైలీ హై స్పీడ్ డేటా ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో 24 రోజులు అన్లిమిటెడ్ డేటాని కూడా అందిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
