కేవలం 18 వేలకే 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి .. ఏంది సామీ ఈ ఆఫర్.!

HIGHLIGHTS

ప్రీమియం సౌండ్ బార్ ఈరోజు ఎవరూ ఊహించనంత చవక ధరలో లభిస్తోంది

34 వేల రూపాయల సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ నుంచి కేవలం 18 వేల ఆఫర్ ధరలో లభిస్తోంది

ఈ సౌండ్ బార్ కంప్లీట్ స్పీకర్ సెటప్ తో 900W గ్రౌండ్ షేకింగ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది

కేవలం 18 వేలకే 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి .. ఏంది సామీ ఈ ఆఫర్.!

ప్రముఖ ఆడియో డివైస్ తయారీ కంపెనీ జెబ్రోనిక్స్ గత సంవత్సరం మార్కెట్లో విడుదల చేసిన ప్రీమియం సౌండ్ బార్ ఈరోజు ఎవరూ ఊహించనంత చవక ధరలో లభిస్తుంది. జెబ్రోనిక్స్ గత సంవత్సరం మధ్యకాలంలో ప్రీమియం ఫీచర్స్ తో 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ ని 34 వేల రూపాయల ధరలో లాంచ్ చేసింది. అయితే, ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అందించిన అతి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 18 వేల రూపాయల ఆఫర్ ధరలోనే లభిస్తోంది. ఈ సాండ్ బార్ ఇండియన్ మార్కెట్లో విడుదలైన తర్వాత ఇంత తక్కువ ధరలో సేల్ అవ్వడం నేనైతే ఇంతవరకు చూడలేదు. అందుకే, ఈ ప్రత్యేకమైన సౌండ్ బార్ డీల్ ని మీకోసం ఈరోజు పూర్తి వివరాలతో అందించాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

7.1.2 Dolby Atmos సౌండ్ బార్ : డీల్

ZEBRONICS BAR 9920 ని మార్కెట్ లో రూ. 34,999 రూపాయల ప్రైస్ టాగ్ తో 2020 సంవత్సరం ఇండియాలో విడుదల చేసింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈ సౌండ్ బార్ పై ఈ రోజు రూ. 15,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 19,999 ధరలోనే లిస్ట్ అవుట్ చేసింది. ఈ ప్రైస్ లో ఈ సౌండ్ బార్ లిస్ట్ అవ్వడం నేను ఇంతవరకు చూడలేదు.

7.1.2 Dolby Atmos soundbar deal ON FLIPKART SALE

ఈ సౌండ్ బార్ పైన అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా ఫ్లిప్ కార్డ్ ఈరోజు జత చేసింది. అదేమిటంటే, ఈ సౌండ్ బార్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి రూ. 1,500 డిస్కౌంట్ అందిస్తుంది. ఈ అదనపు డిస్కౌంట్ ఆఫర్ తో తీసుకుంటే ఈ సౌండ్ బార్ కేవలం రూ. 18,499 అతి చవక ధరలో లభిస్తుంది. నిజానికి, ఈ ప్రైస్ లో కేవలం 5.2.4 సౌండ్ బార్ లు మాత్రమే లభిస్తాయి.

Also Read: అమెజాన్ GIF Sale బిగ్ డిస్కౌంట్ తో 6 వేలకే Samsung Dolby సౌండ్ బార్ లభిస్తోంది.!

7.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ పూర్తిగా ఇంటిని షేక్ చేసే ఉఫర్ మరియు సరౌండ్ సౌండ్ తో నింపే 7.1.2 చల్ సెటప్ తో వస్తుంది. రూమ్ లో అన్ని వైపులా సౌండ్ నింపడానికి వీలుగా ఈ సౌండ్ అబ్రా గతో వచ్చే బార్ లో ముందు మూడు, సైడ్ లో రెండు మరియు పైన నాలుగు స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. బాస్ కోసం ఈ సౌండ్ బార్ తో ఇంటిని షేక్ చేసే సత్తా కలిగిన 12 ఇంచ్ ఉఫర్ స్పీకర్ కలిగిన భారీ సబ్ ఉఫర్ ఉంది.

ఈ సౌండ్ బార్ కంప్లీట్ స్పీకర్ సెటప్ తో 900W గ్రౌండ్ షేకింగ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ మీ ఇంట్లో ఉన్నట్లు మీ వీధి మొత్తానికి తెలిసేలా భారీ బాస్ సౌండ్ ప్రొడ్యూజ్ చేస్తుంది. అంతేకాదు, ఇది డాల్బీ అట్మోస్ మరియు డిటిఎస్ X వర్చువల్ సౌండ్ ఫీచర్స్ తో సినిమా థియేటర్ ని తలపించే అద్భుతమైన సరౌండ్ సౌండ్ కూడా అందిస్తుంది.

ఇది కాకుండా ప్రీమియం సౌండ్ బార్ సిరీస్ కోసం జెబ్రోనిక్స్ ప్రత్యేకంగా అందించిన ZEB Acoustics Max మల్టీ డైమెన్షనల్ సౌండ్ తో మరింత గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI Arc, బ్లూటూత్, ఆప్టికల్, AUX మరియు USB వంటి అన్ని కనెక్టవిటీ ఫీచర్స్ ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile