Samsung Galaxy F70 లాంచ్ అండ్ ప్రైస్ టీజింగ్ చేసిన శాంసంగ్ .. ఫోన్ ఎలా ఉందంటే.!
Samsung Galaxy F70 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ కన్ఫర్మ్
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ వివరాలు కూడా శాంసంగ్ ముందే విడుదల చేసింది
అందమైన స్లీక్ డిజైన్ మరియు 50MP నో షేక్ కెమెరా వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేస్తోంది
Samsung Galaxy F70 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు టీజింగ్ ఫీచర్స్ తో పాటు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ వివరాలు కూడా శాంసంగ్ ముందే విడుదల చేసింది. శాంసంగ్ విడుదల చేయబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ ను చాలా అందమైన స్లీక్ డిజైన్ మరియు 50MP నో షేక్ కెమెరా వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో శాంసంగ్ విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేస్తుంది. ఈ ఫోన్ కీలక ఫీచర్స్ తో పాటు ప్రైస్ తో టీజింగ్ కూడా చేసింది.
SurveySamsung Galaxy F70 లాంచ్ డేట్
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 70 స్మార్ట్ ఫోన్ ను అక్టోబర్ 18 మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు శాంసంగ్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజింగ్ చేసింది మరియు లాంచ్ తర్వాత శాంసంగ్ అఫీషియల్ సైట్ తో పాటు ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి కూడా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

ప్రైస్
ఈ ఫోన్ లాంచ్ ప్రైస్ ని అంచనా వేయాలని కంపెనీ టీజింగ్ చేసింది. ఈ ఫోన్ ప్రైస్ స్థానంలో రూ. 1x,xxx ని హింట్ గా చూపించింది. అంటే, ఈ ఫోన్ 19,999 కంటే ఎక్కువ ప్రైస్ ఉండే అవకాశం లేదని తెలిపింది. అయితే, ఈ ఫోన్ ను 17,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: Oppo Find X10 Pro Max అల్ట్రా ప్రీమియం ట్రిపుల్ 200MP కెమెరాతో లాంచ్ అవుతోంది.!
Samsung Galaxy F70 ఫీచర్స్
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 70 స్మార్ట్ ఫోన్ కేవలం 7.5mm మందం కలిగిన స్లీక్ డిజైన్తో విడుదల చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఇందులో FHD ప్లస్ రిజల్యూషన్ కలిగిన పెద్ద సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది మరియు ఈ స్క్రీన్ పటిష్టమైన గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ తో ఉంటుంది. ఈ ఫోన్ ను శాంసంగ్ యొక్క బడ్జెట్ 5జి చిప్ సెట్ Exynos 1330 తో లాంచ్ చేస్తోంది.
ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ సెటప్ లో OIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్ కెమెరా, 5MP అల్ట్రా వైడ్ మరియు 2MP మైక్రో కెమెరా ఉన్నాయి. అలాగే, ఈ వీడియో కాలింగ్ మరియు సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇక ఈ ఫోన్ కలిగిన బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 5000 mAh భారీ ఉంది మరియు ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంది. ఇందులో లేటెస్ట్ గూగుల్ ai ఫీచర్స్ మరియు శాంసంగ్ యొక్క Knox Security ఫీచర్ కూడా ఉంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
