Oppo Find X10 Pro Max అల్ట్రా ప్రీమియం ట్రిపుల్ 200MP కెమెరాతో లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

Oppo Find X10 Pro Max స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ ని ఒప్పో కన్ఫర్మ్ చేసింది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు కీలక ఫీచర్స్ కూడా రివీల్ చేసింది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ 200MP రియర్ కెమెరా ఉన్నట్లు వెల్లడించింది

Oppo Find X10 Pro Max అల్ట్రా ప్రీమియం ట్రిపుల్ 200MP కెమెరాతో లాంచ్ అవుతోంది.!

Oppo Find X10 Pro Max స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ ని ఒప్పో కన్ఫర్మ్ చేసింది. కేవలం లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేయడం మాత్రమే కాదు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు కీలక ఫీచర్స్ కూడా రివీల్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను అల్ట్రా ప్రీమియం ట్రిపుల్ 200MP కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో తెలిపింది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ తో కూడా లాంచ్ అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Oppo Find X10 Pro Max : లాంచ్ డేట్

ఒప్పో ఫైండ్ ఎక్స్ 10 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో అక్టోబర్ 22వ తేదీ సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు లాంచ్ అవుతుంది. ఈ డేట్ లో ఒప్పో ఫైండ్ ఎక్స్ 10 ప్రో మాక్స్ మరియు ఒప్పో ఫైండ్ ఎక్స్ 10 రెండు ఫోన్లు లాంచ్ చేస్తోంది.

Oppo Find X10 Pro Max : కీలక ఫీచర్స్

ఒప్పో ఫైండ్ ఎక్స్ 10 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ ను అద్భుతమైన ప్రీమియం డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ డిజైన్ వివరాలు వెల్లడించే ఇమేజ్ లను ఒప్పో విడుదల చేసింది. ఈ ఫోన్ తో పాటు అద్భుతమైన Hasselblad టెలీ కన్వర్టర్ కిట్ ను కూడా లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో వెల్లడించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కెమెరా గురించి ఒప్పో ప్రత్యేకంగా టీజింగ్ చేసింది.

Oppo Find X10 Pro Max

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ 200MP రియర్ కెమెరా ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఫోన్ వెనుక భాగంలో పెద్ద స్క్వేర్ బంప్ లో ఈ కెమెరాని అందించింది. ఈ ఫోన్ కలిగిన ఈ కెమెరాతో అల్ట్రా ప్రీమియం ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుందని ఒప్పో టీజింగ్ చేసింది. ఈ ఫోన్ కెమెరాతో తీసినట్లు చెబుతున్న కొన్ని శాంపిల్ ఫోటోలు టీజర్ లో భాగంగా విడుదల చేసింది. ఈ ఫోటోలు చూస్తుంటే, ఈ ఫోన్ కెమెరా గురించి ఒప్పో చెబుతున్న మాట నిజమే అనిపిస్తుంది.

Also Read: జెబ్రోనిక్స్ లేటెస్ట్ 11.2.4 Dolby ATMOS సౌండ్ బార్ పైన ఏకంగా 18 వేల భారీ డిస్కౌంట్ అందించిన ఫ్లిప్ కార్ట్.!

ఈ ఫోన్ ను నడిపించే చిప్ సెట్ వివరాలు కూడా ఒప్పో రివీల్ చేసింది. ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ 2nm చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో తెలిపింది. అదే Dimensity 9600 Pro చిప్ సెట్ మరియు ఇది 43,20,000 నుంచి 48,38,033 AnTuTu స్కోర్ సాధించిన చిప్ సెట్ గా మీడియాటెక్ తెలిపింది. ఇది జస్ట్ చిటికెలలో యాప్స్ ఓపెన్ చేయడమే కాకుండా మల్టీ టాస్కింగ్ మరియు హెవీ గేమింగ్ కోసం చాలా స్మూత్ గా ఉంటుంది. ఈ ఫోన్ ను లూనా వైట్ కలర్ లో అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile