లేటెస్ట్ JBL 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ అద్భుతమైన డీల్స్ ప్రకటించింది.!

HIGHLIGHTS

BL 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డే సేల్ బిగ్ డీల్

ఇంటిని షేక్ చేసే పవర్ఫుల్ సబ్ ఉఫర్ తో పాటు కంప్లీట్ సరౌండ్ సౌండ్ అందించే బార్ ని కూడా కలిగి ఉంటుంది

ఈ సౌండ్ బార్ 440W సూపర్ సరౌండ్ అండ్ హెవీ బాస్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది

లేటెస్ట్ JBL 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ అద్భుతమైన డీల్స్ ప్రకటించింది.!

భారత మార్కెట్లో జేబీఎల్ లేటెస్ట్ గా విడుదల చేసిన పవర్ ఫుల్ సౌండ్ బార్ JBL 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డే సేల్ బిగ్ డీల్స్ అనౌన్స్ చేసింది. ఈ సౌండ్ బార్ ఇంటిని షేక్ చేసే పవర్ఫుల్ సబ్ ఉఫర్ తో పాటు కంప్లీట్ సరౌండ్ సౌండ్ అందించే బార్ ని కూడా కలిగి ఉంటుంది. మరింత గొప్ప విషయం ఏమిటంటే, ఈ సౌండ్ బార్ 35 వేల రూపాయలు బడ్జెట్ లో లాంచ్ కాగా ఈరోజు సేల్ నుంచి కేవలం 28 వేల రూపాయల బడ్జెట్ లోనే లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

JBL 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్

జేబీఎల్ గత సంవత్సరం కొత్తగా కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో Cinema SB595 5.1 (3.1.2) సౌండ్ బార్ ని ఇండియన్ మార్కెట్ లో పరిచయం చేసింది. ఈ సౌండ్ బార్ ను రూ. 34,999 ప్రైస్ ట్యాగ్ తో ఇండియాలో లాంచ్ చేసింది. అయితే, అమెజాన్ పండుగ సేల్ GIF Sale నుంచి ఈ సౌండ్ బార్ ను రూ. 5,000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 29,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది.

JBL 3.1.2 Dolby Atmos soundbar deal

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ పైన మరో గొప్ప డీల్ ని కూడా అమెజాన్ అందించింది. అదేమిటంటే, ఈ సౌండ్ బార్ ని SBI క్రెడిట్ కార్డు తో కొనే వారికి రూ. 1,500 డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 28,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ని ఆఫర్ ధరలో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Also Read: HDR10 vs HDR10+ vs Dolby Vision: ఒక 4K టీవీలో నిజంగా ఏ ఫీచర్లు ముఖ్యం.!

JBL 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఫీచర్స్

ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సౌండ్ సెపరేషన్ తో వస్తుంది. అయితే, ఇందులో 3.1.2 సెటప్ మాత్రమే ఉంటుంది. సెటప్ విషయానికి వస్తే, ఇందులో మూడు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ ఉంటుంది. అలాగే, డీప్ అండ్ హెవీ బాస్ సౌండ్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ సెటప్ తో ఈ సౌండ్ బార్ 440W సూపర్ సరౌండ్ అండ్ హెవీ బాస్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది.

సౌండ్ టెక్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ ట్రూ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది ఇంటిని సినిమా థియేటర్ గా మార్చే రియల్ 3D సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో HDMI eArc, HDMI, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile