Amazon Summer Sale: అమెజాన్ ఇండియా ఎట్టకేలకు అతి పెద్ద సేల్ 2024 సమ్మర్ సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ నుండి భారీ డీల్స్ మరియు ఆఫర్లు అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది. ఈ సేల్ మే 2 వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుందని అమెజాన్ తెలిపింది. ఈ అప్ కమింగ్ అమెజాన్ సేల్ ఆఫర్స్, డీల్స్ మరియు ఇంకా ఏమేమి ఆఫర్ చేయబోతోందో ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Amazon Summer Sale
అమెజాన్ అప్ కమింగ్ సేల్ ‘సమ్మర్ సేల్’ మే 2 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి మొదలవుతుంది. అయితే, Prime Members కోసం ఈ సేల్ 12 గంటల ముందు నుండే, అంటే 2వ తేదీ రాత్రి 12 గంటల నుండే ప్రారంభమవుతుంది. ఈ సేల్ క్లోజింగ్ డేట్ ను మాత్రం అమెజాన్ ఇండియా ఇంకా ప్రకటించ లేదు.
అమెజాన్ సమ్మర్ సేల్ ఆఫర్స్ గురించి మాట్లాడాలంటే ముందుగా బ్యాంక్ ఆఫర్స్ గురించి చెప్పవచ్చు. అమెజాన్ ఇండియా ఈ సమ్మర్ సేల్ ను ICICI, BOB మరియు OneCard బ్యాంక్స్ భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది.
Amazon Summer Sale
అందుకే, ICICI, BOB మరియు OneCard బ్యాంక్ ల కార్డ్స్ తో ఈ సేల్ నుండి వస్తువులను కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ ను అందిస్తుంది. అంటే, ఈ సేల్ నుండి ఈ మూడు బ్యాంక్ ల యూజర్లకు 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
ఇక ప్రత్యేకమైన ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ సేల్ నుండి Sample Mania, క్యాష్ రివార్డ్, అమెజాన్ కూపన్ డిస్కౌంట్ మరియు అమెజాన్ కాంబో వంటి మరిన్ని ఆఫర్లను కూడా అందిస్తోంది.
అమెజాన్ సమ్మర్ సేల్ నుండి స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్, TWS బడ్స్, హెడ్ ఫోన్, సౌండ్ బార్, AC లు, ఫ్రిడ్జ్ లు మరియు వాషింగ్ మెషిన్ వంటి మరిన్ని ప్రోడక్ట్స్ [పైన నఁగొప్ప డీల్స్ ను అందుకోవచ్చు.