Infinix Smart 8 HD: వెరైటీ కలర్ మరియు డిజైన్ తో వస్తున్న కొత్త ఫోన్.!

HIGHLIGHTS

భారత్ మార్కెట్ లో మరొక కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతోంది

Infinix Smart 8 HD నాలుగు వెరైటీ కలర్స్ లలో లాంచ్ అవుతోంది

డిసెంబర్ 8 న ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేయడానికి డేట్ అనౌన్స్ చేసింది

Infinix Smart 8 HD: వెరైటీ కలర్ మరియు డిజైన్ తో వస్తున్న కొత్త ఫోన్.!

భారత్ మార్కెట్ లో మరొక కొత్త స్మార్ట్ ఫోన్ లంచ్ అవుతోంది. ఇప్పటికే చాలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను తీసుకు వచ్చిన ప్రముఖ చైనీస్ మొబైల్ కంపెనీ ఇన్ఫినిక్స్ నుండి ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతోంది. అదే, Infinix Smart 8 HD స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను నాలుగు వెరైటీ కలర్స్ లలో తీసుకు వస్తునట్లు ఇన్ఫినిక్స్ తెలిపింది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 HD స్మార్ట్ ఫోన్ కలిగి ఉండనున్న కొన్ని ఫీచర్స్ తో కంపెనీ టీజింగ్ కూడా మొదలు పెట్టింది. ఈ ఫోన్ ను డిసెంబర్ 8 న ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేయడానికి డేట్ అనౌన్స్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Infinix Smart 8 HD Teased Specs

2023 ఏప్రిల్ నెలలో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 HD స్మార్ట్ ఫోన్ ను మంచి ఫీచర్లతో 7 వేల ఉప బడ్జెట్ లో లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్, ఇప్పుడు దాని తరువాత తరం ఫోన్ గా ఈ స్మార్ట్ 8 HD ను లాంచ్ చేస్తోంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 HD స్మార్ట్ ఫోన్ ను కూడా మార్కెట్ లో తక్కువ బడ్జెట్ లో ఉన్న చాలా ఫోన్ లకు పోటీగా తీసుకు వచ్చే అవకాశం వుంది. ఈ ఫోన్ యొక్క కొన్ని ప్రత్యేకతలను కంపెనీ టీజర్ ద్వారా వెల్లడించింది.

Also Read : Flipkart బిగ్ ధమాకా డేస్ సేల్ నుండి iPhone 12 పైన బిగ్ డీల్.!

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 HD స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించింది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుండి సేల్ కు అందుబాటులోకి వస్తుంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 HD ఫోన్ టీజ్డ్ స్పెక్స్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6 ఇంచ్ HD+ డిస్ప్లేని 500 నిట్స్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది.

Infinix Smart 8 HD Teased Specs
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 HD

ఈ ఫోన్ ఈ బడ్జెట్ ధరలో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన మొదటి ఫోన్ అవుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో ఐఫోన్ ప్రీమియం ఫోన్ లలో కనిపించే డైనమిక్ ఐల్యాండ్ మాదిరిగా కనిపించే ఫీచర్ తో వస్తోంది. ఈ ఫీచర్ ను ఇన్ఫినిక్స్ ‘Magic Ring’ గా పిలుస్తోంది. ఈ ఫీచర్ తో ఈ స్మార్ట్ ఫోన్ సెల్ఫీ కెమేరా చుట్టూ నోటిఫికేషన్ రింగ్ వస్తుంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 HD ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ AI రియర్ కెమేరాని కలిగి వుంది. ఈ ఫోన్ క్రిస్టల్ గ్రీన్, షైనీ గోల్డ్, టింబర్ బ్లాక్ మరియు గెలాక్సీ వైట్ కలర్ ఆపాశం లలో లాంచ్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo