భారీ ఆఫర్లతో అమ్మడువుతున్న నోకియా G20 స్మార్ట్ ఫోన్

భారీ ఆఫర్లతో అమ్మడువుతున్న నోకియా G20 స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

Nokia G20 అమెజాన్ నుండి భారీ డీల్స్ తో అమ్ముడవుతోంది

ఈ ఫోన్ తో రూ. 500 రూపాయల కూపన్ ను ఆఫర్ల చేస్తోంది

11,850 రూపాయల వరకూ భారీ ఎక్స్ చేంజ్ అఫర్ చేస్తోంది

HMD గ్లోబల్ ఇటీవల విడుదల చేసిన Nokia G20 స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ నుండి భారీ డీల్స్ తో అమ్ముడవుతోంది. Nokia G20 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ.12,999 రూపాయల ధరతో వచ్చింది. అయితే, Nokia G20 స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ నుండి 500 రూపాయల డిస్కౌంట్ తో రూ.12,490 రూపాయల ధరకే అమ్ముడవుతోంది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ తో రూ. 500 రూపాయల కూపన్ ను కూడా ఆఫర్ల చేస్తోంది. అధనంగా, ఎక్స్ చేంజ్ అఫర్ ద్వారా ఎంచుకుంటే 11,850 రూపాయల వరకూ భారీ ఎక్స్ చేంజ్ కూడా అఫర్ చేస్తోంది. Buy from Here

Nokia G20: ఫీచర్లు

నోకియా జి 20 స్మార్ట్‌ ఫోన్ 4×2.3 GHz, 4×1.8 GHz ఆక్టా-కోర్ మీడియాటెక్ Helio G35 ప్రాసెసర్‌ శక్తితో పనిచేస్తుంది. ఈ శక్తివంతమైన ప్రొసెసర్ కి జతగా 4 జీబీ ర్యామ్ కూడా ఉంది. కాబట్టి, మెమరీ-ఇంటెన్సివ్ యాప్స్ వాడే సమయంలో కూడా ఈ ఫోన్ సజావుగా నడుస్తుంది. ఈ ఫోన్ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. కానీ, ఈ ఫోన్ లో స్టోరేజ్ ను పెంచడానికి ఎటువంటి అప్షన్ లేదు. కాబట్టి, నోకియా జి 20 ను ఎన్నుకునేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.

నోకియా జి 20 పెద్ద 6.5-అంగుళాల స్క్రీన్‌ వస్తుంది మరియు దానికి మద్దతు ఇవ్వడానికి తగిన శక్తివంతమైన 5050 mAh బ్యాటరీతో కూడా వస్తుంది. ఈ డిస్ప్లే HD+ (1600 X 720) రిజల్యూషన్‌తో ఉంటుంది.

నోకియా జి 20 లో క్వాడ్ రియర్ కెమెరా వుంది. ఇందులో,  కెమెరా సిస్టమ్ 48 + 5+ 2 + 2 మెగాపిక్సెల్ తో వుంటుంది మరియు 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్  f / 1.8 కెమెరా ఎపర్చరును కలిగి ఉంది. ఇది హై డైనమిక్ రేంజ్ (HDR) ఇమేజింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo