Fire-Boltt Lumos: అతి తక్కువ ధరలో స్టైన్ లెస్ స్టీల్ లగ్జరీ స్మార్ట్ వాచ్ వచ్చేసింది.!

HIGHLIGHTS

ఫైర్ బోల్ట్ నుండి కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్ అయ్యింది

Fire-Boltt Lumos స్టైన్ లెస్ స్టీల్ లగ్జరీ లుక్స్ తో వచ్చింది

ఈ కొత్త ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ మంచి ఫీచర్లను కూడా కలిగి వుంది

Fire-Boltt Lumos: అతి తక్కువ ధరలో స్టైన్ లెస్ స్టీల్ లగ్జరీ స్మార్ట్ వాచ్ వచ్చేసింది.!

నమ్మకమైన బడ్జెట్ స్మార్ట్ వాచ్ వాచ్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన ఫైర్ బోల్ట్ నుండి కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్ అయ్యింది. Fire-Boltt Lumos పేరుతో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ వాచ్ అతి తక్కువ ధరలో స్టైన్ లెస్ స్టీల్ లగ్జరీ లుక్స్ తో వచ్చింది. కేవలం లుక్స్ మాత్రమే కాదు ఈ కొత్త ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ మంచి ఫీచర్లను కూడా కలిగి వుంది. అయితే, ఈ స్మార్ట్ వాచ్ ధరను మాత్రం ప్రసుతం మార్కెట్ లో ఈ రేంజ్ లో ఉన్న చాలా స్మార్ట్ వాచ్ లకు గట్టి పాటుగా ఫైర్ బోల్ట్ సెట్ చేసినట్లుగా కనిపిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Fire-Boltt Lumos Price

ఫైర్ బోల్ట్ యొక్క ఈ లేటెస్ట్ స్మార్ట్ వాచ్ లుమోస్ ధరను రూ. 1,499 రూపాయలుగా సెట్ చేసింది. ఈ వాచ్ 5 స్టెయిన్ లెస్ స్టీల్ స్ట్రాప్స్ కలర్ ఆప్షన్స్ మరియు 6 సిలికాన్ స్ట్రాప్ కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ లేటెస్ట్ స్మార్ట్ వాచ్ ను ఫైర్ బోల్ట్ వెబ్సైట్ మరియు అమేజాన్ ఇండియా నుండి సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ వాచ్ ను అమేజాన్ నుండి నేరుగా కొనడానికి Buy From Here లింక్ పైన నొక్కండి.

Also Read : Jio vs Airtel: ఉచిత Netflix సబ్ స్క్రిప్షన్ అందించే బెస్ట్ ప్లాన్స్.!

ఫైర్ బోల్ట్ లుమోస్ ప్రత్యేకతలు

ఫైర్ బోల్ట్ లుమోస్ స్మార్ట్ వాచ్

ఫైర్ బోల్ట్ లుమోస్ స్మార్ట్ వాచ్ 1.8 ఇంచ్ బిగ్ TFT LCD డిస్ప్లేని 2D హై హర్డ్నెస్ గ్లాస్ మరియు 240×286 రిజల్యూషన్ తో కలిగి వుంది. ఈ ఫైర్ బోల్ట్ లేటెస్ట్ వాచ్ ఫుల్ మెటల్ బాడి మరియు స్టీల్ స్ట్రాప్స్ తో కూడా వస్తుంది. ఈ వాచ్ లో 118 స్పోర్ట్ మోడ్స్ మరియు SpO2 ట్రాకింగ్ ఫీచర్స్ ఉన్నాయి.

ఇన్ బిల్ట్ మైక్రో ఫోన్ మరియు స్పీకర్ తో HD కాలింగ్ అందిస్తుందని ఫైర్ బోల్ట్ తెలిపింది. ఈ వాచ్ హార్ట్ రేట్ ట్రాకింగ్మరియు స్లీప్ మోనిటరింగ్ తో కూడా వస్తుంది. ఇది క్విక్ యాక్సెస్ డయల్ ప్యాడ్, కాల్ హిస్టరీ మరియు షింక్ అండ్ సేవ్ ఫీచర్లతో కూడా వస్తుంది. ఈ వాచ్ మెటల్ స్ట్రాప్స్ మరియు సిలికాన్ స్ట్రాప్స్ తో ఈ బడ్జెట్ ధరలో చాలా లగ్జరి వాచ్ లా కనిపిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo