Lava Bold N2: బడ్జెట్ సిరీస్ నుండి కొత్త ఫోన్ లాంచ్ కోసం లావా టీజింగ్.!

HIGHLIGHTS

లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి టీజర్ విడుదల చేసింది

బోల్డ్ సిరీస్ నుంచి Lava Bold N2 ఫోన్ ను లాంచ్ చేస్తోంది

ఈ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ ఇండియా నుంచి టీజింగ్ మొదలు పెట్టింది

Lava Bold N2: బడ్జెట్ సిరీస్ నుండి కొత్త ఫోన్ లాంచ్ కోసం లావా టీజింగ్.!

Lava Bold N2: ప్రముఖ ఇండియన్ మొబైల్ తయారీ కంపెనీ లావా తాన్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి టీజర్ విడుదల చేసింది. లావా బడ్జెట్ సిరీస్ అయిన బోల్డ్ సిరీస్ నుంచి ఈ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. అదే, లావా బోల్డ్ ఎన్ 2 మరియు ఈ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ ఇండియా నుంచి టీజింగ్ మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ లావా ఫోన్ అంచనా స్పెక్స్ మరియు లాంచ్ వివరాలు చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava Bold N2: లాంచ్ డేట్?

లావా బోల్డ్ ఎన్ 2 స్మార్ట్ ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ అవుతుంది. లావా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ వివరాలు ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ డిజైన్ మరియు ఫీచర్స్ తెలిసేలా టీజర్ ఇమేజ్ తో టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వచ్చే వారాంతాల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఇది కంపెనీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు కచ్చితమైన డేట్ గురించి తెలియదు.

Lava Bold N2

Lava Bold N2: ఫీచర్స్

ఈ లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ స్లీక్ డిజైన్ తో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది కాకుండా ఈ ఫోన్ లో వెనుక పెద్ద కెమెరా బంప్ లో డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ అవుతుంది. ఈ డ్యూయల్ రియర్ కెమెరా లో 13MP మెయిన్ కెమెరా జతగా మరో కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ అడుగు భాగంలో టైప్ C ఛార్జ్ పోర్ట్, స్పీకర్ మరియు 3.5 జాక్ ఉంటాయి. ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్స్ లో లాంచ్ అవుతుంది.

Also Read: అమెజాన్ భారీ డిస్కౌంట్ తో డ్యూయల్ ఉఫర్ 5.2 Dolby Soundbar అతి చవక ధరలో లభిస్తోంది.!

లావా బోల్డ్ ఎన్ 2: అంచనా ఫీచర్స్

ఈ అప్ కమింగ్ లావా స్మార్ట్ ఫోన్ Unisoc 9863A వంటి యునిసోక్ బడ్జెట్ చిప్ సెట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని కొన్ని లీక్స్ చెబుతున్నాయి. ఇది కాకుండా బిగ్ HD+ స్క్రీన్, 4GB ర్యామ్ మరియు 5000 mAh బిగ్ బ్యాటరీ ఉండవచ్చు. ఈ ఫోన్ సిల్వర్ మరియు బ్లాక్ రెండు రంగుల్లో లాంచ్ అవుతుందని కూడా లీక్స్ చెబుతున్నాయి. ఇక ఈ ఫోన్ అంచనా ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ అండర్ రూ. 8,000 ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo