Jio vs Airtel: ఉచిత Netflix సబ్ స్క్రిప్షన్ అందించే బెస్ట్ ప్లాన్స్.!

HIGHLIGHTS

టెలికం కంపెనీలు ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ కు పెద్ద పీట వేస్తున్నాయి.

అతిపెద్ద తేలిక కంపెనీలు నెట్ ఫ్లిక్స్ జతగా అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్

జియో మరియు ఎయిర్టెల్ నెట్ ఫ్లిక్స్ జతగా అందిస్తున్న ప్లాన్స్

Jio vs Airtel: ఉచిత Netflix సబ్ స్క్రిప్షన్ అందించే బెస్ట్ ప్లాన్స్.!

Jio vs Airtel: అతిపెద్ద టెలికం కంపెనీలైన జియో మరియు ఎయిర్టెల్ రెండు టెలికం కంపెనీలు కూడా ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ కు పెద్ద పీట వేస్తున్నాయి. ఇప్పటికే తమ పోర్ట్ ఫోలియోలో ఉన్న ప్లాన్ లతో పాటుగా మరిన్ని కూడా ప్లాన్ లను కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పటి వరకూ Disney+ Hotstar తో మాత్రమే ఎంటర్టైన్మెంట్ ప్లాన్ లను అందించిన ఎయిర్టెల్, ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ జతగా ప్లాన్ లను కూడా తీసుకు వచ్చింది. అయితే, రిలయన్స్ జియో ముందు నుండే నెట్ ఫ్లిక్స్ తో ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తోంది. అందుకే, ఈ రెండు అతిపెద్ద తేలిక కంపెనీలు నెట్ ఫ్లిక్స్ జతగా అందిస్తున్న ఆ బెస్ట్ ప్లాన్స్ పైన ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Jio vs Airtel: best Netflix plans

ఉచిత నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ తో రిలయన్స్ జియో రెండు ప్రీపెయిడ్ ప్లాన్ ను అందిస్తోంది. ఎయిర్టెల్ కూడా ఉచిత నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ తో ఒక ప్లాన్ అందిస్తోంది. రిలయన్స్ జియో రూ. 1,099 మరియు రూ. 1,499 ప్లాన్ లను ఉచిత నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ తో ఆఫర్ చేస్తోంది. ఎయిర్టెల్ ఉచిత నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ తో రూ. 1,499 రూపాయల ప్లాన్ ను ఆఫర్ చేస్తోంది.

Also Read : boAt Katana Blade: కొత్త ఫీచర్ తో ఇయర్ బడ్స్ లాంచ్ చేసిన బోట్.!

జియో రూ. 1,099 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో రూ. 1,099 జియో ఉచిత నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ తో వస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్, 4G నెట్ వర్క్ పైన రోజుకు 2GB డేటా (అన్లిమిటెడ్ 5జి డేటా) మరియు డైలీ 100SMS లను అందిస్తుంది. అంతేకాదు, జియోటీవీ, జియోసినిమా మరియు జియో క్లౌడ్ లకు కూడా ఉచిత యాక్సెస్ అందిస్తుంది.

జియో రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్

jio rs 1499 prepaid plan
జియో రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్

జియో ఆఫర్ చేస్టున్న ఈ ప్లాన్ జియో రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీ మరియు ఉచిత నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. అలాగే, అన్లిమిటెడ్ కాలింగ్, 4G నెట్ వర్క్ పైన రోజుకు 3GB డేటా (అన్లిమిటెడ్ 5జి డేటా) తోపాటు డైలీ 100SMS లను కూడా అందిస్తుంది. అంతేకాదు, జియోటీవీ, జియోసినిమా మరియు జియో క్లౌడ్ లకు కూడా ఉచిత యాక్సెస్ అందిస్తుంది.

ఎయిర్టెల్ రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్

airtel rs 1499 prepaid plan
ఎయిర్టెల్ రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్టెల్ రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే, ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ మరియు ఫ్రీ నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ పూర్తి చెల్లుబాటు కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్, 4G నెట్ వర్క్ పైన డైలీ 3GB డేటా (అన్లిమిటెడ్ 5జి డేటా) తో పాటు డైలీ 100SMS లను కూడా అందిస్తుంది. అంతేకాదు, అపోలో 24|7 సర్కిల్, ఫ్రీ హలొ ట్యూన్స్ మరియు Wynk మ్యూజిక్ యాక్సెస్ కూడా అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo