Xiaomi 18 Pro Max లాంచ్ అనౌన్స్ చేసిన షియోమీ .. కళ్ళు చెదిరే డిజైన్ తో వస్తోంది.!
Xiaomi 18 Pro Max లాంచ్ ని షియోమీ అనౌన్స్ చేసింది.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పైన భారీ అంచనాలు పెంచేలా టీజర్ విడుదల చేసింది
ఈ ఫోన్ ను Snapdragon 8 Elite Gen 6 Series చిప్ సెట్ తో లాంచ్ చేస్తుంది
Xiaomi 18 Pro Max లాంచ్ ని ఈరోజు షియోమీ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పైన భారీ అంచనాలు పెంచేలా ఈ ఫోన్ టీజర్ ని విడుదల చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యాపిల్ లేటెస్ట్ ఫోన్ లకు పోటీ నిచ్చేలా ఉండే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోన్ ను Snapdragon 8 Elite Gen 6 Series చిప్ సెట్ తో లాంచ్ చేయబోతున్నట్లు కూడా షియోమీ అనౌన్స్ చేసింది. అయితే, ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. అయితే, ఈ ఫోన్ లాంచ్ అవుతోంది ఇండియాలో కాదు, ఈ ఫోన్ ను ముందుగా చైనా మార్కెట్ లో లాంచ్ చేసిన తర్వాత ఈ ఫోన్ ను గ్లోబల్ మార్కెట్ లో కూడా విడుదల చేయబోతున్నట్లు షియోమీ తెలిపింది.
SurveyXiaomi 18 Pro Max చైనాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది?
షియోమి 18 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ ని చైనా లో సెప్టెంబర్ 23 వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో లాంచ్ చేస్తుంది. ఇది చైనా CST టైం కాబట్టి, ఇది మన దేశంలో సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ ను మొదట చైనాలో లాంచ్ చేసిన తర్వాత ఇదే సంవత్సరంలో గ్లోబల్ మార్కెట్ లో కూడా విడుదల చేయనున్నట్లు షియోమీ తెలిపింది.
Xiaomi 18 Pro Max : ఫీచర్స్
షియోమీ ఈ ఫోన్ ను Snapdragon 8 Elite Gen 6 Series చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ అయ్యే మొదటి ఫోన్ గా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ఇది 2nm టెక్నాలజీతో క్వాల్కమ్ నిర్మించిన ఏజంటిక్ AI చిప్ సెట్. ఈ చిప్ సెట్ ఏకంగా 5.0 GHz శక్తి తో కంప్యూటర్ మాదిరి సూపర్ ఫాస్ట్ పెర్ఫామెన్స్ అందించే శక్తి కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లాంచ్ కోసం చైనా అఫీషియల్ సైట్ లో ఈరోజు నుంచి ప్రీ బుకింగ్స్ కూడా షియోమి మొదలు పెట్టింది. అదే సైట్ లో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివరాలు కూడా అందించింది. ఈ ఫోన్ లో వెనుక కెమెరా తో పాటు పెద్ద సెకండరీ రియర్ స్క్రీన్ ఉంటుంది. ఇది ఈ ఫోన్ ను మరింత ప్రీమియం గా మరియు ఫ్యూచరిస్టిక్ గా చేసింది.
Also Read: Oppo K14 Plus లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది .. అదిరే ఫీచర్స్ తో లాంచ్ కి సిద్ధం.!
ఈ ఫోన్ లో LEICA యొక్క లేటెస్ట్ అండ్ పవర్ ఫుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా సెటప్ లో 3.2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ కలిగిన పెరిస్కోప్ కెమెరా ఉంటుందని షియోమీ తెలిపింది. ప్రస్తుతానికి, ఈ వివరాలు మాత్రమే అఫీషియల్ గా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ లాంచ్ అప్డేట్స్ అండ్ లాంచ్ ఇన్ఫో తో రేపు కలుద్దాం.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
