Infinix Note Edge 5G: టాప్ ఫీచర్లు మరియు అంచనా ప్రైస్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

ఇన్ఫినిక్స్ ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది

Infinix Note Edge 5G లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ కలిగిన కీలకమైన ఫీచర్స్ వెల్లడించింది

ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన టీజర్ పేజీ నుంచి ఈ వివరాలు అందించింది

Infinix Note Edge 5G: టాప్ ఫీచర్లు మరియు అంచనా ప్రైస్ తెలుసుకోండి.!

Infinix Note Edge 5G: ఇన్ఫినిక్స్ ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. నోట్ ఎడ్జ్ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ కలిగిన కీలకమైన ఫీచర్స్ మరియు డిజైన్ వివరాలు కూడా కంపెనీ టీజర్ ద్వారా వెల్లడించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్, అంచనా ధర మరియు టాప్ ఫీచర్లు ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Infinix Note Edge 5G: లాంచ్ డేట్?

ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5జి స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 18, 2026 న లాంచ్ ఇండియాలో లాంచ్ అవుతుందని కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ XOS 16 తో రిలీజ్ అయ్యే మొదటి ఫోన్ కూడా అవుతుంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన టీజర్ పేజీ నుంచి ఈ వివరాలు అందించింది.

Infinix Note Edge 5G: టాప్ ఫీచర్స్

ఇన్ఫినిక్స్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ టాప్ అండ్ కీలక ఫీచర్లు వెల్లడించింది. ముందుగా ఈ ఫోన్ డిజైన్ గురించి ప్రత్యేకంగా తెలిపింది. ఈ ఫోన్ కేవలం 7.2mm మందతో ఉంటుంది మరియు ఈ ప్రైస్ లో ఇంత సన్నగా ఉండే కర్వ్డ్ డిస్ప్లే ఇదే అని కూడా నొక్కి చెప్పింది. ఈ ఫోన్ లో గొరిల్లా గ్లాస్ 7i గ్లాస్ ప్రొటెక్షన్ కలిగిన 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ TUV బ్లూ లైట్ వెరిఫికేషన్, 1.5K రిజల్యూషన్ మరియు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Infinix Note Edge 5G

ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7100 5G చిప్ సెట్ తో లాంచ్ చేస్తుంది. ఇది 7,50,000 కంటే అధిక AnTuTu స్కోర్ కలిగిన ప్రోసెసర్ మరియు AI శక్తితో జతగా వస్తుంది. ఇందులో బైపాస్ ఛార్జ్, పెర్ఫార్మన్స్ మోడ్, టచ్ ఆప్టిమైజేషన్, నెట్ వర్క్ ఎన్ హెన్స్మెంట్ మరియు మ్యాజిక్ వాయిస్ చేంజర్ వంటి మరిన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి.

Also Read: Google Pixel 10 Price Drop: గూగుల్ ఫోన్ పై భారీ తగ్గింపు అందుకోండి.!

ఈ ఫోన్ లో వెనుక పెద్ద స్క్వేర్ బంప్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్ జతగా మరో సెన్సార్ ఉంటుంది. కెమెరా సెటప్ పక్కనే RGB హేలో లైట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను JBL ట్యూన్ సౌండ్ కలిగిన డ్యూయల్ స్పీకర్ సెటప్ తో అందిస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5జి స్మార్ట్ ఫోన్ IP65 రేటింగ్ తో డస్ట్ అండ్ స్ప్లాష్ ప్రొటెక్షన్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ మరిన్ని వివరాలు కూడా కంపెనీ రెండు రోజుల్లో వెల్లడిస్తుంది.

అంచనా ప్రైస్

ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో మిడ్ రేంజ్ ఫోన్ గా లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అంటే, ఈ ఫోన్ 20 వేల నుంచి 25 వేల రూపాయల ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo