Google Pixel 10 Price Drop: గూగుల్ ఫోన్ పై భారీ తగ్గింపు అందుకోండి.!
గూగుల్ పిక్సెల్ లేటెస్ట్ ఫోన్ ఇప్పుడు మంచి తగ్గింపు ధరలో లభిస్తుంది
అన్ని ఆఫర్స్ కలుపుకొని 10 వేల రూపాయల తక్కువ ధరలో మీకు లభిస్తుంది
Google Pixel 10 Price Drop పూర్తి వివరాలు తెలుసుకోండి
Google Pixel 10 Price Drop: గూగుల్ పిక్సెల్ లేటెస్ట్ ఫోన్ ఇప్పుడు మంచి తగ్గింపు ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయిన ధరతో పోలిస్తే అన్ని ఆఫర్స్ కలుపుకొని 10 వేల రూపాయల తక్కువ ధరలో మీకు లభిస్తుంది. జబర్దస్త్ కెమెరా ఫోన్ గా పేరొందిన ఈ గూగుల్ ఫోన్ ను ఆఫర్ ధరలో అందుకోవాలని చూస్తున్న వారికి ఇదే సరైన సమయం. ఈ గూగుల్ పిక్సెల్ ఫోన్ ఆఫర్ గురించి కంప్లీట్ వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకోండి.
SurveyGoogle Pixel 10 Price Drop : ఆఫర్
గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ రూ. 79,999 ప్రైస్ ట్యాగ్ తో ఇండియాలో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 5,000 తగ్గింపు అందుకుని రూ. 74,999 ధరలో లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 5,000 రూపాయల HDFC క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ లేదా మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ పై రూ. 5,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 69,999 రూపాయల ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయిన ధరతో పోలిస్తే ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 10,000 రూపాయల తక్కువ ధరలో లభిస్తుంది.
Also Read: Lava Bold N2: బడ్జెట్ సిరీస్ నుండి కొత్త ఫోన్ లాంచ్ కోసం లావా టీజింగ్.!
Google Pixel 10 : ఫీచర్స్
ఈ గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ 6.3 అంగుళాల OLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ తో పాటు 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే చాలా బ్రైట్ మరియు స్మూత్ విజువల్స్ తో మంచి యూజర్ అనుభవం ఇస్తుంది. ఈ పిక్సెల్ ఫోన్ Tensor G5 (TSMC 3 nm ప్రాసెస్) తో నడుస్తుంది మరియు జతగా Titan M2 సెక్యూరిటీ కో ప్రాసెసర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 12 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 256 జీబీUFS 4.0 స్టోరేజ్ కలిగి ఉంటుంది. Android 16 తో వస్తుంది మరియు అప్ కమింగ్ అప్డేట్స్ మరియు రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ప్రామిస్ చేస్తుంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో 48MP ప్రైమరీ వైడ్, 10.8MP (5×) టెలిఫొటో మరియు 13 MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 10.5MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 60FPS వద్ద చాలా స్థిరమైన వీడియోలు మరియు గొప్ప ఫోటోలు అందిస్తుంది. ఇది టన్నుల కొద్దీ గూగుల్ పిక్సెల్ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4,970 mAh బ్యాటరీ, 29 W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ మరియు 15W Qi2 వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.