Vu Glo LED Smart Tv పై బిగ్ డీల్స్ అందించిన అమెజాన్ ఇండియా.!
Vu Glo LED Smart Tv పై ఈరోజు అమెజాన్ ఇండియా మంచి డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది
ఈరోజు అమెజాన్ అందించిన డీల్స్ తో ఈ టీవీ మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది
ఈ స్మార్ట్ టీవీ డీల్ మరియు ఈ టీవీ డీటెయిల్స్ తెలుసుకోండి
Vu Glo LED Smart Tv పై ఈరోజు అమెజాన్ ఇండియా మంచి డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ టీవీ గొప్ప విజువల్స్ అందించే స్క్రీన్ మరియు మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది. అయితే, ఈరోజు అమెజాన్ అందించిన డీల్స్ తో ఈ టీవీ మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈరోజు అమెజాన్ అందించిన ఈ స్మార్ట్ టీవీ డీల్ మరియు ఈ టీవీ డీటెయిల్స్ తెలుసుకోండి.
SurveyVu Glo LED Smart Tv : ఆఫర్
వియు గ్లో ఎల్ఈడి సిరీస్ నుంచి రీసెంట్ గా అందించిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 43 GLOQLED25 ఈరోజు అమెజాన్ నుంచి 33% డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 23,499 ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ అయ్యింది. ఈ డిస్కౌంట్ తో పటు మరో రెండు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అమెజాన్ ఈ టీవీ పై అందించింది.

అవేమిటంటే, ఈ టీవీ పై రూ. 1,300 రూపాయల అదనపు కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అమెజాన్ అందించింది. ఇది కాకుండా ఈ టీవీ పై Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో రూ. 1250 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అమెజాన్ అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 20,949 రూపాయల ధరలో ఈరోజు లభిస్తుంది. Buy From Here
Also Read: iOS 26.3 Update: ఆసక్తికరమైన ఫీచర్స్ తో కొత్త అప్‌డేట్ అందించిన ఆపిల్.!
Vu Glo LED Smart Tv : ఫీచర్స్
ఈ వియు స్మార్ట్ టీవీ 43 ఇంచ్ పరిమాణం కలిగిన A+ Grade Glo ప్యానల్ కలిగి ఉంటుంది. ఇది QLED డిస్ప్లేని 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ 400 నిట్స్ బ్రైట్నెస్, HDR10, HLG మరియు MEMC వంటి ఫీచర్స్ తో మంచి ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో వస్తుంది మరియు 2 జీబీ ర్యామ్ తో పాటు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి 24W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ మంచి ఆడియో ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ లో డాల్బీ అట్మాస్ సపోర్ట్, ఆడియో ఓన్లీ మోడ్, ఆటో వాల్యూమ్ కంట్రోల్ మరియు క్రికెట్ అండ్ సినిమా మోడ్ వంటి ఫీచర్ తో మంచి సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ HDMI, USB, 2 వే బ్లూటూత్, ఈథర్నెట్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile