HMD Vibe2 Pro 5G: ఆకట్టుకునే బడ్జెట్ ధరలో స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
HMD Vibe2 Pro 5G జస్ట్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది
ఈ ఫోన్ డిజైన్ మొదలుకొని బ్యాటరీ వరకు చాలా ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది
ఈ ఫోన్ కేవలం రూ. 14,999 రూపాయల అతి చవక దరలో లభిస్తుంది
HMD Vibe2 Pro 5G: ప్రస్తుతం మంచి ఫీచర్స్ తో ఒక 5జి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలంటే కనీసం 20 వేల రూపాయలైనా ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే, HMD ఈ బాధ నుంచి విముక్తి కలిగించింది. చాలా ఆకర్షణీయమైన ధరలో స్టన్నింగ్ ఫీచర్స్ తో వైబ్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్ లో పరిచయం చేసింది. ఈ ఫోన్ డిజైన్ మొదలుకొని బ్యాటరీ వరకు చాలా ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది.
SurveyHMD Vibe2 Pro 5G: ప్రైస్
హెచ్ఎండి ఈ లేటెస్ట్ ఫోన్ ను కేవలం రూ. 15,999 స్టార్టింగ్ ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ 6GB + 128GB వేరియంట్ ని ఈ ప్రైస్ తో అందించింది. ఇదే కాదు 8GB + 128GB హై ఎండ్ వేరియంట్ ని కూడా కేవలం రూ. 17,999 రూపాయల ధరకే అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ పై ICICI అండ్ Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 10% డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 14,999 రూపాయల అతి చవక దరలో లభిస్తుంది.

అక్టోబర్ 8 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ అవుతుంది. అంటే, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం అవుతుంది.
Also Read: Oppo K14 Plus 5G మిడ్ రేంజ్ ధరలో పవర్ ఫుల్ 8000 mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది.!
HMD Vibe2 Pro 5G: ఫీచర్స్
హెచ్ఎండి వైబ్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే డ్యూయల్ టోన్ తో చూడగానే ఆకట్టుకునే డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ 6.78 ఇంచ్ LCD స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ 5G చిప్ సెట్ శక్తి తో పని చేస్తుంది.
ఈ చిప్ సెట్ తో జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OS ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ 2 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ సపోర్ట్ కలిగి ఉంటుంది. హెచ్ఎండి ఈ ఫోన్ లో 6000 mAh భారీ బ్యాటరీ ని కూడా అందించింది. అలాగే, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

ఇక ఈ ఫోన్ కెమెరా విభాగానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64MP IMX 682 ప్రధాన కెమెరా మరియు 2MP మైక్రో కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో ముందు 13MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.ఏ ఈ ఫోన్ FHD వీడియో రికార్డింగ్, కెమెరా ఫీచర్స్ మరియు ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ప్రముఖ భారతీయ ఏఐ Sarvam AI తో కూడా వస్తుంది. ఇదే కాదు డ్యూయల్ మైక్ అండ్ డ్యూయల్ స్పీకర్ కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది.
ఓవరాల్ గా ఈ లేటెస్ట్ హెచ్ఎండి వైబ్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ బడ్జెట్ యూజర్ ను ఆకట్టుకునే అన్ని రకాల ఫీచర్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యిందని చెప్పవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
