Oppo F35 Series లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ అనౌన్స్ చేసిన ఒప్పో .. డిజైన్ కొత్తగా ఉంది.!

HIGHLIGHTS

Oppo F35 Series ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లు ఒప్పో ఈరోజు అనౌన్స్ చేసింది

ఈ అప్ కమింగ్ ఒప్పో స్మార్ట్ ఫోన్ సిరీస్ సరికొత్త డిజైన్ తో లాంచ్ అవుతుంది

ఈ ఫోన్లలో 50MP అల్ట్రా వైడ్ నేచురల్ సెల్ఫీ కెమెరా ఉందని ఒప్పో కన్ఫర్మ్ చేసింది

Oppo F35 Series లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ అనౌన్స్ చేసిన ఒప్పో .. డిజైన్ కొత్తగా ఉంది.!

Oppo F35 Series మీ ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లు ఒప్పో ఈరోజు అనౌన్స్ చేసింది. కేవలం అనౌన్స్ చేయడమే కాదు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ ని సైతం రిలీజ్ చేసింది. ఒప్పో ఈ ఫోన్ కోసం ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజీ నుంచి అందించిన వివరాల ప్రకారం, ఈ అప్ కమింగ్ ఒప్పో స్మార్ట్ ఫోన్ సిరీస్ సరికొత్త డిజైన్ తో మరియు మార్కెట్ ని ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ కాబోతున్నట్లు అర్థం అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Oppo F35 Series లాంచ్ డేట్ ఏమిటి?

ఒప్పో ఎఫ్ 35 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను అక్టోబర్ 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లు ఒప్పో డేట్ ను కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్ నుంచి ఒప్పో ఎఫ్ 35 మరియు ఒప్పో ఎఫ్ 35 ప్రో రెండు ఫోన్లు లాంచ్ చేస్తునట్లు కూడా అనౌన్స్ చేసింది. అప్ కమింగ్ సిరీస్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజి అందించి టీజింగ్ చేసింది. అంటే, ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Oppo F35 Series కీలక ఫీచర్స్ ఏమిటి?

ఒప్పో ఈ అప్ కమింగ్ సిరీస్ నుంచి రెండు ఫోన్లు రిలీజ్ చేస్తుంది. ఇందులో రెగ్యులర్ వేరియంట్ ఎఫ్ 35 మరియు ప్రో వేరియంట్ ఒప్పో ఎఫ్ 35 ప్రో ఉన్నాయి. ఈ రెండు ఫోన్ ల డిజైన్ వేరు వేరుగా ఉంటుంది మరియు రెండు ఫోన్ల డిజైన్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇందులో ఎఫ్ 35 స్మార్ట్ ఫోన్ అల్ట్రా స్లిమ్ స్టైలిష్ డెకో డిజైన్ తో వస్తుంది. ఇది కేవలం 1.67మ్మ్ ఇన్ఫై నైట్ ఎడ్జ్ తో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది.

Oppo F35 Series launch

ఒక ఎఫ్ 35 ప్రో వేరియంట్ విషయానికి వస్తే, ఈ ఫోన్ స్మైల్ కర్వ్ డిజైన్ తో వస్తుంది మరియు స్టార్రి సీ లెన్స్ మాడ్యూల్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను ఫ్లాగ్ షిప్ లెవెల్ వన్ పీస్ కోల్డ్ కార్వింగ్ తో అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ AI కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ సరికొత్త ఆరెంజ్ కలర్ తో లాంచ్ అవుతుంది.

Also Read: మొబైల్ రీఛార్జ్ పై TRAI గుడ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ లో నిజం తెలుసుకోండి.!

ఈ రెండు ఫోన్లు కూడా గ్రూప్ సెల్ఫీ ఎక్స్‌పర్ట్ గా ఉంటాయని ఒప్పో తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్లలో 50MP అల్ట్రా వైడ్ నేచురల్ సెల్ఫీ కెమెరా ఉందని ఒప్పో కన్ఫర్మ్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ మరిన్ని కీలక ఫీచర్స్ ఒప్పో ఒక్కొక్కటిగా రివీల్ చేస్తుంది. ఈ ఫోన్ మరిన్ని కీలక అప్‌డేట్స్ తో మల్లి కలుద్దాం.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile