మొబైల్ రీఛార్జ్ పై TRAI గుడ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ లో నిజం తెలుసుకోండి.!

HIGHLIGHTS

మొబైల్ రీఛార్జ్ పై TRAI గుడ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్

ట్రాయ్ చెప్పింది ఒకటైతే ఇక్కడ సోషల్ మీడియాలో నడుస్తున్న కథనం మరియు స్టోరీ హెడ్ లైన్ మరొకటి చెబుతున్నాయి

షల్ మీడియాలో వైరల్ న్యూస్ లో నిజం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

మొబైల్ రీఛార్జ్ పై TRAI గుడ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ లో నిజం తెలుసుకోండి.!

మొబైల్ రీఛార్జ్ పై TRAI గుడ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. నిజానికి ట్రాయ్ చెప్పింది ఒకటైతే ఇక్కడ సోషల్ మీడియాలో నడుస్తున్న కథనం మరియు స్టోరీ హెడ్ లైన్ మరొకటి చెబుతున్నాయి. టెలికాం కంపెనీలు అన్ని కూడా 30 రోజుల వ్యాలిడిటీ అందించే రీఛార్జ్ ప్లాన్ ఇవ్వాలని ట్రాయ్ కొత్త రూల్ తెచ్చినట్లు సోషల్ మీడియాలో తెగ ఊదరగొడుతున్నారు. అయితే, ఇది నిజానికి 2024 లో తెచ్చిన రూల్ ని మరింత కఠినం చేయడం అని ఎవరూ చెప్పడం లేదు. సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ లో నిజం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

TRAI గుడ్ న్యూస్ నిజమేనా?

అవును, ట్రాయ్ గుడ్ న్యూస్ నిజమే. కానీ సోషల్ మీడియా చెబుతున్నట్లు 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్స్ అన్ని 30 రోజుల ప్లాన్స్ గా మారతాయి అనేది మాత్రం అసత్యం. నిజానికి, ట్రాయ్ అలాంటి ప్రకటన ఏమి చేయలేదు. ప్రజలకు అనుకూలంగా 30 రోజులు మరియు నెల రోజుల రీఛార్జ్ ప్లాన్స్ అందించాలని మాత్రమే తెలిపింది. అంటే, ఇప్పటికే ఉన్న ప్లాన్ ల లలో మార్పు చేయడం లేదా ప్రత్యేకమైన కొత్త ప్లాన్ తీసుకురావడం అనేది టెలికాం కంపెనీ నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది.

ఏది ఏమైనా సరే ఒక 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ మరియు ఒక డేట్ టు డేట్ మాత్రమే రీఛార్జ్ చేసే నెల రోజుల ప్లాన్ ఒకటి ప్రతి టెలికాం కంపెనీ వారి యూజర్లకు ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది. ఇది కాకుండా బడ్జెట్ ధరలో కేవలం కాలింగ్ మరియు SMS తో మాత్రమే వచ్చే చవక ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఒకటి అందించాలి. ఇది కూడా అన్ని టెలికాం కంపెనీలకు వర్తిస్తుంది. కాబట్టి, ఈ రెండు వేర్వేరు విషయాలు కలిపి చూడకూడదు.

Also Read: iPhone 17 పై భారీ డీల్స్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్ .. అఫీషియల్ సైట్ కంటే 20 వేల చవక ధరలో లభిస్తుంది.!

TRAI నిబంధన ప్రకారం ప్లాన్స్ ఎలా ఉండాలి?

2026 ట్రాయ్ నిబంధన ప్రకారం, ప్రతి టెలికాం కంపెనీ కూడా 30 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్, ప్రతి నెల అదే తేదీన రెన్యూ అయ్యే ప్లాన్ మరియు కేవలం Voice + SMS జతగా ఉన్న ప్లాన్ ఒక్కటైనా కలిగి ఉండాలి. అంటే, ఈ మూడు ప్లాన్స్ ను ప్రతీ టెలికాం ఆపరేట్ కూడా వారి యూజర్లకు అందించాలి.

ముఖ్యంగా ప్రభుత్వం కేవలం Voice + SMS ప్రీపెయిడ్ ప్లాన్ పై ఎక్కువగా దృష్టి సారించింది. ఎందుకంటే, డేటా అవసరం లేని ఫీచర్ ఫోన్ కలిగిన యూజర్లు ఇప్పటికీ దేశంలో కోట్లల్లో ఉన్నారు. డేటాతో వచ్చే రీఛార్జ్ ప్లాన్స్ తో వారు అవసరం లేని మరియు ఉపయోగించని సర్వీస్ కోసం కూడా డబ్బు చెల్లించాల్సి వస్తోంది. అందుకే, ఫీచర్ ఫోన్ వాడే వారి కోసం మరియు డేటా అవసరం లేని సీనియర్ సిటిజన్ వంటి మరింత మంది యూజర్ల కోసం ఈ ప్లాన్ అందించాలని టెలికం కంపెనీలను ఆదేశించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile