iPhone 17 పై భారీ డీల్స్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్ .. అఫీషియల్ సైట్ కంటే 20 వేల చవక ధరలో లభిస్తుంది.!

HIGHLIGHTS

iPhone 17 పై ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు బిగ్ డీల్ ని అనౌన్స్ చేసింది

రీసెంట్ గా ఐఫోన్ 17 రేట్లు యాపిల్ అమాంతం పెంచేసింది

అఫీషియల్ సైట్ ధరతో పోలిస్తే ఏకంగా 20 వేల రూపాయల చవక ధరలో లభిస్తుంది

iPhone 17 పై భారీ డీల్స్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్ .. అఫీషియల్ సైట్ కంటే 20 వేల చవక ధరలో లభిస్తుంది.!

iPhone 17 పై ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు బిగ్ డీల్ ని అనౌన్స్ చేసింది. రీసెంట్ గా ఐఫోన్ 17 తో పాటు ఐఫోన్ 17 సిరీస్ యొక్క అన్ని ఫోన్ రేట్లు యాపిల్ అమాంతం పెంచేసింది. లాంచ్ ధరతో పోలిస్తే ఏకంగా 23 శాతం వరకు ఈ ఫోన్ రేటును యాపిల్ పెంచేసింది. ఆ దెబ్బకు ఐఫోన్ కొత్త ఫోన్ వస్తే పాత ఫోన్ రేటు తగ్గుతుందని ఎదురు చూసిన వారికి నీట మాట లేకుండా పోయింది. అయితే, ఐఫోన్ 17 ఫోన్ ను బడ్జెట్ ధరలో కొనాలని చూసే వారికి కొత్త ఆశగా ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ చిగురించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iPhone 17 : ఫ్లిప్ కార్ట్ ఆఫర్ ఏమిటి?

ఐఫోన్ 17 స్మార్ట్ ఫోన్ ను యాపిల్ ఇప్పుడు రూ. 99,900 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో సేల్ చేస్తోంది. ఈ ప్రైస్ ను రీసెంట్ గా నిర్వహించిన యాపిల్ లాంచ్ ఈవెంట్ నుంచి అనౌన్స్ చేసింది. అయితే, ఐఫోన్ 17 ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి అన్ని ఆఫర్స్ తో కేవలం రూ. 77,999 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేసింది. ఇది అఫీషియల్ సైట్ లో లభిస్తున్న ధరతో పోలిస్తే ఏకంగా 20 వేల రూపాయల చవక ధరలో లభిస్తుంది.

‘రేపు ఐఫోన్ కొంటే ఎక్కువ చెల్లించాలి, కానీ ఈరోజు కొంటే కాదు’ అని ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ సేల్ కోసం టీజర్ పేజి అందించి టీజింగ్ చేసింది. ఇందులో ఐఫోన్ 17 ఫోన్ ను ఏ ఆఫర్ తో ఎంత ధరలో పొందవచ్చునో తెలిపే వివరాలు కూడా లిస్ట్ అవుట్ చేసింది.

ఆఫర్ వివరాల్లోకి వెళితే, ఐఫోన్ 17 ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 84,999 ప్రైస్ ట్యాగ్ తో సేల్ చేస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. అలాగే, ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడి కార్డ్ తో EMI తో కొనే వారికి రూ. 4,000 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ కూడా అందిస్తుంది. ఈ మొత్తం ఆఫర్స్ తో ఈ ఫోన్ రూ. 77,999 రూపాయల సేల్ ఆఫర్ ప్రైస్ లో లభిస్తుంది.

iPhone 17 deal on flipkart bbd sale

అయితే, ఈ ఫోన్ ను నార్మల్ ICICI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి కేవలం రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ మాత్రమే అందిస్తుంది. ఈ ఆఫర్ తో తీసుకునే వారికి ఈ ఫోన్ రూ. 79,999 రూపాయల ధరలో లభిస్తుంది.

Also Read: Flipkart BBD Sale నుంచి కేవలం 19 వేలకే Dolby Atmos క్యూలెడ్ స్మార్ట్ టీవీ అందుకోండి.!

iPhone 17 : ప్రత్యేకత

ఐఫోన్ 17 ఫోన్ చాలా గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వేగవంతమైన లేటెస్ట్ యాపిల్ A19 Chip ఉంటుంది. ఇది గొప్ప పెర్ఫార్మెన్స్ తో పాటు సిరామిక్ షీల్డ్ 2 గ్లాస్ అండ్ మెటల్ ఫ్రేమ్ తో చాలా మన్నికైన డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ కెమెరా గురించి యెంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే, ఈ ఫోన్ 4K Dolby Vision వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు ప్రత్యేకమైన యాపిల్ ఫిల్టర్లు మరియు కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అందించే యాపిల్ బడ్జెట్ ఫోన్ గా చెప్పబడుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile