Realme GT 7 Pro ఫస్ట్ లుక్ టీజర్ విడుదల: కళ్ళు చెదిరే డిజైన్ తో ఆకట్టుకుంటోంది.!
Realme GT 7 Pro స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్
Snapdragon 8 Elite తో రియల్ మీ GT 7 ప్రో ఫోన్ ను లాంచ్ అవుతోంది
ఈ రియల్ మీ అప్ కమింగ్ ఫోన్ కళ్ళు చెదిరే డిజైన్ తో ఆకట్టుకుంటోంది
Realme GT 7 Pro స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ మొదలు పెట్టిన రియల్ మీ, ఇప్పుడు ఈ ఫోన్ డిజైన్ తో కూడిన ఫాస్ట్ లుక్ ఇమేజ్ లను విడుదల చేసింది. Snapdragon 8 Elite చిప్ సెట్ తో రియల్ మీ GT 7 ప్రో ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు ముందుగా ప్రకటించిన రియల్ మీ, ఇప్పుడు ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ లను కూడా వెల్లడించింది. ఈ రియల్ మీ అప్ కమింగ్ ఫోన్ కళ్ళు చెదిరే డిజైన్ తో ఆకట్టుకుంటోంది.
SurveyRealme GT 7 Pro
రియల్ మీ GT 7 ప్రో స్మార్ట్ ఫోన్ ను నవంబర్ లో లాంచ్ చేయబోతున్నట్లు రియల్ మీ ప్రకటించింది. అయితే, ఈ ఫోన్ లాంచ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ తో మొదటి ఫోన్ ను లాంచ్ చేసిన కంపెనీగా మరియు రియల్ మీ GT 7 ప్రో ఈ చిప్ సెట్ తో వచ్చిన మొదటి స్మార్ట్ ఫోన్ గా నిలబెట్టాలని కంపెనీ చూస్తోంది.

ఇక రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ GT 7 ప్రో టీజర్ ఇమేజ్ ద్వారా కంపెనీ అందించిన వివరాలు చూస్తే, ఈ ఫోన్ ను సరికొత్త Mars Design తో లాంచ్ చేస్తుంది. అంటే, ఈ ఫోన్ అరుణగ్రహం మార్స్ ను పోలిన కలర్ మరియు టెక్స్చర్ తో ఉంటుంది. ఈ ఫోన్ ఏవియేషన్ అల్యుమినియం ఫ్రేమ్ తో చాలా స్లీక్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో కనిపిస్తోంది.
Built tough, designed to inspire. The Mars-inspired Aviation Aluminium Frame of the #realmeGT7Pro brings aircraft-level durability & comfort together in one package. #GT7ProFirst8EliteFlagship
— realme (@realmeIndia) October 27, 2024
Know more: https://t.co/ogLS1ueJet#ExploreTheUnexplored #amazonIndia #DarkHorseofAI pic.twitter.com/TMPgFDQRz6
రియల్ మీ GT 7 ప్రో టీజర్ ఇమేజ్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. అంతేకాదు, ఈ సెటప్ రియల్ మీ లేటెస్ట్ కెమెరా టెక్నాలజీ ‘HyperImage+’ సపోర్ట్ వుంది. ఈ కెమెరా సెటప్ పెద్ద డబుల్ లేయర్ స్క్వేర్ బంప్ లో అందించింది. ఓవరాల్ గా ఈ రియల్ మీ అప్ కమింగ్ ఫోన్ డిజైన్ మరియు కెమెరా సెటప్ తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
Also Read: Amazon Sale: చివరి రోజుల్లో గొప్ప Soundbar డీల్స్ అందించిన అమెజాన్.!
ఈ ఫోన్ ను గొప్ప పెర్ఫార్మెన్స్ అందించే భారీ చిప్ సెట్ తో లాంచ్ చేస్తోంది. అదే, స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ 5G పవర్ ఫుల్ చిప్ సెట్. ఈ చిప్ సెట్ ఏకంగా 30,00,000 లకు పైగా AnTuTu స్కోర్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇంట పవర్ ఫుల్ చిప్ సెట్ కి సర్వసాధారణంగా హెవీ LPDDR5 ర్యామ్ మరియు వేగవంతమైన హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ లను జత చేసే అవకాశం ఉంటుంది.
కాబట్టి, రియల్ మీ GT 7 ప్రో స్మార్ట్ ఫోన్ భారీ ఫీచర్స్ మరియు స్పెక్స్ తో మార్కెట్ లో అడుగు పెట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ అప్ కమింగ్ ఫోన్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.