OPPO K14x 5G: బిగ్ బ్యాటరీ మరియు స్టైలిష్ లుక్ లో లాంచ్ అయ్యింది.!
ఈరోజు ఒప్పో కొత్త ఫోన్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది
OPPO K14x 5G 6500 mAh బిగ్ బ్యాటరీ మరియు స్టైలిష్ లుక్ డిజైన్ తో లాంచ్ అయ్యింది
ఈ ఫోన్ ను Flipkart మరియు ఒప్పో అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు ప్రీ బుక్ చేసుకోవచ్చు
OPPO K14x 5G: ఈరోజు ఒప్పో కొత్త ఫోన్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. అదే ఒప్పో కె 14x స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను 15 వేల రూపాయల ఉప బడ్జెట్ ధరలో 6500 mAh బిగ్ బ్యాటరీ మరియు స్టైలిష్ లుక్ డిజైన్ తో అందించింది. ఒప్పో ఇండియన్ మార్కెట్లో ఈ రోజు ప్రవేశపెట్టిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
SurveyOPPO K14x 5G: ప్రైస్
ఒప్పో ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ మరియు రెండు రంగుల్లో అందించింది. ఈ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ 4 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ తో కేవలం రూ. 14,999 ధరతో లాంచ్ అయ్యింది. ఒప్పో కె 14x ఫోన్ రెండో వేరియంట్ రూ. 16,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ వేరియంట్ 4 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ తో ఉంటుంది. ఈ ఫోన్ ఐసీ బ్లూ మరియు ప్రిజం వయోలెట్ రెండు రంగుల్లో లభిస్తుంది.
ఆఫర్స్ అండ్ సేల్
ఈ ఒప్పో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పై రూ. 1,500 రూపాయల SBI, HDFC మరియు ICICI బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈరోజు నుంచి ఈ ఫోన్ ముందస్తు బుకింగ్స్ ను కంపెనీ ప్రారంభించింది. ఈ ఫోన్ ను Flipkart మరియు ఒప్పో అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు ప్రీ బుక్ చేసుకోవచ్చు.
Also Read: Realme narzo 90x: వాలంటైన్స్ డే కోసం కొత్త మెరూన్ కలర్ లో లాంచ్ అయ్యింది.!
OPPO K14x 5G: ఫీచర్స్
ఒప్పో కె14x స్మార్ట్ ఫోన్ 6.75 ఇంచ్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే కలిగి ఉంటుంది మరియు ఇది HD గేమింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 5జి చిప్ సెట్ తో నడుస్తుంది. ఇందులో 6 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ లో RAM Expansion ఫీచర్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ మంచి స్లీక్ డిజైన్ లో చూడగానే ఆకట్టుకునే రంగుల్లో ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ కలర్ OS సాఫ్ట్ వేర్ తో Android 16 ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ 50MP మెయిన్ సెన్సార్ జతగా 2MP సెకండరీ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ AI Eraser 2.0 వంటి ఆకట్టుకునే ఏఐ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6500 mAh బిగ్ బ్యాటరీ తో లాంచ్ అయ్యింది. ఇది కాకుండా ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఒప్పో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ IP64 రేటింగ్ తో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile