Realme narzo 90x: వాలంటైన్స్ డే కోసం కొత్త మెరూన్ కలర్ లో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

Realme narzo 90x స్మార్ట్ ఫోన్ ఇప్పుడు కొత్త కలర్ వేరియంట్ కూడా లాంచ్ అయ్యింది

వాలెంటైన్స్ డే సందర్భంగా సరికొత్త మెరూన్ కలర్ వేరియంట్ ను రియల్‌మీ విడుదల చేసింది

2026 వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేకంగా మెరూన్ కలర్ వేరియంట్ ను ఇప్పుడు లాంచ్ చేసింది

Realme narzo 90x: వాలంటైన్స్ డే కోసం కొత్త మెరూన్ కలర్ లో లాంచ్ అయ్యింది.!

Realme narzo 90x స్మార్ట్ ఫోన్ ఇప్పుడు కొత్త కలర్ వేరియంట్ కూడా లాంచ్ అయ్యింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ ఫోన్ సరికొత్త మెరూన్ కలర్ వేరియంట్ ను రియల్‌మీ విడుదల చేసింది. ఈ ఫోన్ గత సంవత్సరం మే నెలలో ఇండియాలో లాంచ్ అయ్యింది. అయితే, 2026 వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేకంగా మెరూన్ కలర్ వేరియంట్ ను ఇప్పుడు లాంచ్ చేసింది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో ఆకట్టుకుంటుంది మరియు ఇప్పుడు కొత్త రంగుల్లో కూడా లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme narzo 90x : ప్రైస్

రియల్‌మీ నార్జో 90x స్మార్ట్ ఫోన్ కొత్త మెరూన్ వేరియంట్ ను కూడా కూడా కేవలం రూ. 13,999 రూపాయల ఆఫర్ ధరలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క 6GB + 128GB వేరియంట్ ను ఈ ధరలో లాంచ్ చేసింది.ముందుగా ఈ ఫోన్ నైట్రో బ్లూ మరియు ఫ్లాష్ బ్లూ రెండు రంగుల్లో మాత్రమే లభించింది. అయితే, ఇప్పుడు మెరూన్ కలర్ లో కూడా లభిస్తుంది. ఈ ఫోన్ ఫిబ్రవరి 14వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ మీకు అమెజాన్ ఇండియా మరియు రియాల్ మీ అధికారిక సైట్ నుండి లభిస్తుంది.

Also Read: Vivo V70: లాంచ్ డేట్ , అంచనా ధర మరియు కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.!

Realme narzo 90x : ఫీచర్స్

రియల్‌మీ నార్జో 90x స్మార్ట్ ఫోన్ ముఖ్యంగా తను కలిగిన బిగ్ బ్యాటరీ కోసం ఎక్కువ ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే, ఈ ఫోన్ లో 7000 mAh భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 60W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో వుంది. ఈ ఫోన్ కేవలం 35 నిముషాల్లోనే 50% బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో పని పనిచేస్తుంది. ఇందులో 6 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15OS తో వస్తుంది.

Realme narzo 90x Maroon Variant Price

ఈ ఫోన్ లో వెనుక 50MP Sony మెయిన్ కెమెరా కలిగిన AI డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ AI Edit Gene మరియు ఏఐ ఎడిటర్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 400% అధిక వాల్యూమ్ అందించే స్టీరియో స్పీకర్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ 144Hz అధిక రిఫ్రెష్ రేట్ కలిగిన 6.8 ఇంచ్ బిగ్ LCD స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది 1570 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo