POVA Curve 2 5G చాలా స్లీక్ డిజైన్ లో భారీ 8000 mAh బ్యాటరీతో లాంచ్ అవుతోంది.!
POVA Curve 2 5G మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది
ఈ ఫోన్ ను చాలా స్లీక్ డిజైన్ లో భారీ 8000 mAh బ్యాటరీతో లాంచ్ అవుతుందని కంపెనీ అనౌన్స్ చేసింది
ఈ బిగ్ బ్యాటరీతో ఈ ఫోన్ రెండు రోజులు బ్యాకప్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది
POVA Curve 2 5G: టెక్నో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం కొత్త విడుదల చేసిన టీజర్ ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే, ఈ ఫోన్ ను చాలా స్లీక్ డిజైన్ లో భారీ 8000 mAh బ్యాటరీతో లాంచ్ అవుతుందని కంపెనీ అనౌన్స్ చేసింది. నిన్న మొన్నటి వరకు 6000 mAh మరియు 7000 mah బ్యాటరీ ఫోన్స్ ట్రెండ్ కొనసాగితే, ఇప్పుడు ఈ ఫోన్ 8000 mAh బ్యాటరీ ట్రెండ్ సెట్ చేసే అవకాశం ఉండవచ్చని చెబుతున్నారు.
SurveyPOVA Curve 2 5G : లాంచ్ డేట్
టెక్నో పోవా కర్వ్ 2 స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 13వ తేదీ మధ్యాహ్నం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబడుతుంది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ద్వారా కంపెనీ టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో కూడిన ప్రత్యేకమైన టీజర్ పేజీని కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది.
POVA Curve 2 5G : ఫీచర్స్
టెక్నో పోవా కర్వ్ 2 స్మార్ట్ ఫోన్ కొత్త స్టార్ షిప్ ఇన్స్పైర్డ్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో ఉన్నట్లు ఈ ఫోన్ ఇమేజ్ చూడగానే అర్ధం అవుతుంది. ఈ ఫోన్ కర్వుడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది మరియు ఈ స్క్రీన్ కళ్ళకు హాని కలిగించని ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ చూడగానే ఆకట్టుకునే సరికొత్త డిజైన్ తో కూడా ఉంది. ఈ ఫోన్ కేవలం 7.42mm మందంతో ఉంటుంది మరియు 195 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది.

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ లో కూడా 8000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన స్లీక్ డిజైన్ లో పెద్ద బ్యాటరీ కలిగిన ఫోన్ గా ఇది వస్తుంది. ఈ బిగ్ బ్యాటరీతో ఈ ఫోన్ రెండు రోజులు బ్యాకప్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ ఛార్జ్ మరియు రివర్స్ ఛార్జ్ టెక్ వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే, ఇది చాలా వేగవంతమైన వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Sarvam AI vs ChatGPT vs Gemini : ఎందులో ఏది గొప్పో తెలిస్తే షాక్ అవుతారు.!
ఇక ఈ ఫోన్ గురించి కంపెనీ తెలిపిన మరిన్ని కీలక వివరాలు చూస్తే, ఈ ఫోన్ మంచి సిగ్నల్ అందించే సెటప్ మరియు ఫీచర్ కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో ఆకట్టుకునే సెన్సార్ ఉంటుందని మనం ఆశించవచ్చు. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మరిన్ని అప్‌డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.