Sarvam AI vs ChatGPT vs Gemini : ఎందులో ఏది గొప్పో తెలిస్తే షాక్ అవుతారు.!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) అద్భుతాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే
ఏఐ కి పెరిగిన ఆదరణ మరియు ఉపయోగంతో కంపెనీలు వాటి ఏఐ మోడల్స్ రంగంలోకి దించుతున్నాయి
బెంగళూరు బేస్డ్ కంపెనీ కొత్త సర్వం ఏఐ పేరుతో కొత్త ఇండియన్ ఏఐ మోడల్ ను తీసుకొచ్చింది
Sarvam AI vs ChatGPT vs Gemini: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న కొత్త టెక్ మరియు ఇది ఇప్పటికే అద్భుతాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఏఐ కి పెరిగిన ఆదరణ మరియు ఉపయోగంతో అనేక కంపెనీలు వాటి ఏఐ మోడల్స్ రంగంలోకి దించుతున్నాయి. అయితే, ఎక్కువ విదేశీ మోడల్స్ మాత్రమే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నాయి. కానీ, కొత్తగా బెంగళూరు బేస్డ్ కంపెనీ కొత్త సర్వం ఏఐ పేరుతో కొత్త ఇండియన్ ఏఐ మోడల్ ను తీసుకొచ్చింది. ఈ ఏఐ అడుగు పెడుతూనే మంచి పేరు సంపాదించుకుంది. అయితే, ప్రతి ఏఐ అన్నింటిలో గొప్పగా ఉండకపోవచ్చు. వాటిలో ఒక విషయం బాగా నచ్చేదిగా మరియు ప్రజలు మెచ్చేదిగా వుండే అవకాశం ఉంటుంది. ఈరోజు అటువంటి విషయం గురించి చూడనున్నారు. సర్వం ఏఐ, చాట్ జిపిటి మరియు గూగుల్ జెమినీ మూడు ఏఐ ప్లాట్ ఫామ్స్ ఎందుకూ ఏది గొప్పో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
SurveySarvam AI vs ChatGPT vs Gemini : ఎందులో ఏది గొప్ప?
భారతీయ యువత తీసుకొచ్చిన సర్వం ఏఐ కొన్ని విషయాల్లో చాట్ జిపిటి మరియు జెమినీ కంటే మెరుగ్గా ఉంటుందని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. అందులో అతి ముఖ్యమైనది OCR (డాక్యుమెంట్ రీడింగ్ / డాక్యుమెంట్ ఇంటెలిజెన్స్) విభాగం. ఈ విభాగంలో olmOCR-Bench లో అందించిన రిపోర్ట్ మరియు రిజల్ట్స్ సర్వం ఏఐ ని అగ్ర స్థానంలో నిలబెట్టాయి. ఈ బెంచ్ లో సర్వం ఏఐ 84.3 % కచ్చితత్వంతో చాట్ జిపిటి మరియు జెమినీ రెండింటిని వెనక్కు నెట్టి అగ్రస్థానంలో నిలిచింది.

అంతేకాదు, వర్డ్ యాక్యురసీ (22 భాషల్లో) కూడా సర్వం విజన్ అగ్ర స్థానంలో నిలిచింది. ఇందులో సర్వం ఏఐ 87.36% శాతం యాక్యురసీ కలిగి ఉన్నట్లు OCR Bench తెలిపింది. ఈ పట్టికలో 82.51% తో గూగుల్ జెమినీ రెండో స్థానంలో నిలిచింది. అంటే, భారతీయ భాషల్లో సర్వం ఏఐ చాలా గొప్పగా ఉన్నట్లు ఈ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇది భారతీయ భాషల్లో టెక్స్ట్ టు స్పీచ్ మరియు స్పీచ్ టు టెక్స్ట్ వంటి పనుల్లో మంచి ఫలితాలు అందిస్తుంది. ఎందుకంటే, ఇది భారతీయ భాషలు మరియు సంస్కృతి ని మరింత లోతుగా అధ్యాయం చేసే మోడల్ కాబట్టి ఈ పనులు చాలా చక్కగా నిర్వహిస్తుంది.
అయితే, ఇది జనరల్ పర్పస్ AI అసిస్టెంట్ మాదిరిగా ఉండదు. అంటే, డీప్ సెర్చ్, సాధారణ
కన్వర్జేషన్ మరియు కోడింగ్ వంటి సంక్లిష్టమైన మైన పనులు నిర్వహణలో వెనకబడుతుంది.

ChatGPT :
ఇది జనరల్ పర్పస్ కన్వర్జేషన్ ఏఐ మోడల్. ఇది ఆర్టికల్ రైటింగ్, కోడింగ్ రాయడం మరియు ప్రాంప్ట్ రాయడం వంటి కంటెంట్ జనరేషన్ పనులు చక్కగా నిర్వహిస్తుంది. అంతేకాదు, ఎడ్యుకేషన్ మరియు రీసర్చ్ కోసం కూడా చాట్ జిపిటి గొప్పగా ఉంటుంది. ముఖ్యంగా, ఇది క్రియేటివ్ రైటింగ్ మరియు ఐడియాస్ కోసం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది లాజికల్ ప్రాబ్లమ్స్ మరియు లాంగ్ కన్వర్జేషన్ కోసం బాగా ఉపయోగపడుతుంది. అలాగే, ఇటీవల అందించిన ఇమేజెస్ ఫీచర్ తో విలక్షణమైన ఫోటోలు కూడా అందుకోవచ్చు.
Also Read: OPPO K14x 5G: బిగ్ బ్యాటరీ మరియు స్టైలిష్ లుక్ లో లాంచ్ అయ్యింది.!
Gemini Ai :
గూగుల్ జెమినీ ఏఐ పూర్తిగా గూగుల్ ఎకో సిస్టమ్ కి గొప్పగా ఉంటుంది. అంటే, ఆండ్రాయిడ్ సిస్టం సెర్చ్ మరియు వర్క్ స్పేస్ కోసం ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా జనరల్ కన్వర్జేషన్ ఏఐ మోడల్ మరియు లాజికల్ థింకింగ్ ఎబిలిటీ కూడా కలిగి ఉంటుంది. ఇమేజ్ కోసం నానో బనానా మరియు వీడియో క్రియేషన్ కోసం గూగుల్ జెమినీ Veo 3 చాలా గొప్ప ఆప్షన్స్ అవుతాయి. ఇది రోజు వారి ఉపయోగానికి మరియు వివిధమైన కంటెంట్ క్రియేషన్ కోసం మీకు చక్కగా ఉంటుంది.
ఒక చివరిగా ఈ మూడు ఏఐ మోడల్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, సర్వం ఏఐ భారతీయ భాషల్లో స్పీచ్ అండ్ రైటింగ్ కోసం డాక్యుమెంట్ రీడింగ్ కోసం వరల్డ్ క్లాస్ పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. చాట్ జిపిటి రైటింగ్, కోడింగ్ మరియు రీజనింగ్ వంటి జనరల్ యూసేజ్ కోసం బాగుంటుంది. గూగుల్ జెమినీ మాత్రం సెర్చ్ మరియు మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్ తో రోజు ఉపయోగానికి చక్కగా ఉంటుంది. అయితే, వినియోగ అవసరాలు మరియు రోజు వాడకం బట్టి ఈ వివరాల్లో మార్పు ఉండవచ్చు.
గమనిక : యూజర్ అనుభవం మరియు ఆన్‌లైన్ లో అందుబాటులో ఉన్న రిపోర్ట్స్ ఆధారంగా ఈ ఆర్టికల్ అందించాము.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile