అండర్ రూ. 8,000 ప్రైస్ సెగ్మెంట్ లో బెస్ట్ 5.1 Dolby Soundbar డీల్స్ ఇవిగో.!
ఇంట్లో ఉన్న స్మార్ట్ టీవీకి తగిన 5.1 Dolby Soundbar డీల్స్
ఈ రోజు మీకోసం రెండు బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి
మంచి ఫీచర్స్ మరియు 500W కంటే ఎక్కువ సౌండ్ అందించే జబర్దస్త్ సౌండ్ సెటప్ కలిగి ఉంటాయి
ఇంట్లో ఉన్న స్మార్ట్ టీవీకి తగిన 5.1 Dolby Soundbar డీల్స్ కోసం చూస్తుంటే, ఈ రోజు మీకోసం రెండు బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు సౌండ్ బార్ లు కూడా మంచి ఫీచర్స్ మరియు 500W కంటే ఎక్కువ సౌండ్ అందించే జబర్దస్త్ సౌండ్ సెటప్ కలిగి ఉంటాయి. ఈ రెండు సౌండ్ బార్ ఆఫర్స్ మరియు ఈ సౌండ్ బార్ కంప్లీట్ ఫీచర్ వివరాలు ఇక్కడ అందించాము.
Survey5.1 Dolby Soundbar : ఆఫర్స్
పై తెలిపిన విధంగా ఈరోజు రెండు సౌండ్ బార్ డీల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ రెండు సౌండ్ బార్ డీల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇక ఏ డీల్స్ వివరాల్లోకి వెళితే, మోటోరోలా Amphisoundx Vibe మరియు జెబ్రోనిక్స్ Juke Bar 9400 Pro రెండు సౌండ్ బార్స్ కూడా ఈరోజు డిస్కౌంట్ ధరలో లభిస్తున్నాయి. ఈ సౌండ్ బార్ డీల్స్ ఇప్పుడు చూద్దాం.

మోటోరోలా Amphisoundx Vibe
మోటోరోలా ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 78% డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ పై కెనరా బ్యాంక్ కార్డ్ రూ. 800 అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 7,199 ధరకే లభిస్తుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 500W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో, లాంగ్ బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో HDMI Arc, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.
Also Read: POVA Curve 2 5G చాలా స్లీక్ డిజైన్ లో భారీ 8000 mAh బ్యాటరీతో లాంచ్ అవుతోంది.!
జెబ్రోనిక్స్ Juke Bar 9400 Pro
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ కూడా ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 78% డిస్కౌంట్ తో రూ. 7,999 రూపాయల డిస్కౌంట్ ప్రైస్ లో లిస్ట్ అవుట్ అయ్యింది. ఇది కూడా కెనరా బ్యాంక్ కార్డ్ రూ. 800 అదనపు డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తుంది. అంటే, ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 7,199 రూపాయల ఆఫర్ ధరలో మీ సొంతం చేసుకోవచ్చు. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ కలిగి టోటల్ 525W సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ రియర్ శాటిలైట్ స్పీకర్స్ మరియు పవర్ ఫుల్ బాస్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఇది కూడా డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కలిగి ఉంటుంది. అలాగే, HDMI Arc, ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ ఇందులో కూడా ఉన్నాయి.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile