OnePlus 15 : టాప్ 5 ఫీచర్స్ లాంచ్ కంటే ముందే తెలుసుకోండి.!
OnePlus 15 స్మార్ట్ ఫోన్ మరో రెండు రోజుల్లో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది
Snapdragon 8 Elite Gen 5 చిప్స్ ఎట్ వంటి గొప్ప ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది
వన్ ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ ను వన్ ప్లస్ 13s మాదిరి స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ చేస్తుంది
OnePlus 15 స్మార్ట్ ఫోన్ మరో రెండు రోజుల్లో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ముందుగా చైనా మార్కెట్ లో లాంచ్ అయ్యింది మరియు ఇప్పుడు ఇండియాలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ బ్లేజింగ్ ఫాస్ట్ ప్రోసెసర్ వంటి Snapdragon 8 Elite Gen 5 చిప్స్ ఎట్ వంటి గొప్ప ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ ఏమిటో తెలుసుకోండి.
SurveyOnePlus 15 టాప్ 5 ఫీచర్స్
డిజైన్
వన్ ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ ను వన్ ప్లస్ 13s మాదిరి స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ చేస్తుంది. ఇది మైక్రో ఆర్క్ ఆక్సిడేషన్ మిడిల్ ఫ్రేమ్ కలిగిన ఇండస్ట్రీ ఫస్ట్ ఫోన్ అవుతుంది. ఈ ఫోన్ కేవలం 1.15mm అంచులు కలిగి ఎక్కువ డిస్ప్లే ఆఫర్ చేసే డిజైన్ తో ఉంటుంది.
డిస్ప్లే
వన్ ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ FHD+ డిస్ప్లే తో వస్తుంది. ఈ స్క్రీన్ 165Hz రిఫ్రెష్ రేట్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 18000 గ్లోబల్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.
పెర్ఫార్మెన్స్
వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ 3 నానో మీటర్ క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 8 Elite 5 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇది 40 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందిస్తుంది. ఈ ఫోన్ LPDDR5X ర్యామ్ మరియు UFS 4.1 ఫాస్ట్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఇది గొప్ప పెర్ఫార్మెన్స్ అందించే గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది.

కెమెరా
ఈ వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో మూడు 50MP కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8K మరియు 4K వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 4K వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగిన 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ అనేకమైన కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Soundbar Smart TV పై అమెజాన్ బిగ్ డీల్స్ అందుకోండి.!
బ్యాటరీ అండ్ ఛార్జ్ టెక్
వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ లో 7300 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది మరియు ఈ బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 120W అల్ట్రా ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్ మరియు 50W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
పైన తెలిపిన టాప్ 5 ఫీచర్స్ కాకుండా ఈ ఫోన్ IP68 రేటింగ్ మరియు IP69 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.