Moto Pad 60 Neo: మోటో పెన్ సపోర్ట్ మరియు 2.5K స్క్రీన్ తో లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

మోటోరోలా అప్ కమింగ్ ప్యాడ్ లాంచ్ అనౌన్స్ చేసింది

ఈ అప్ కమింగ్ ప్యాడ్ ను మోటో పెన్ సపోర్ట్ మరియు 2.5K స్క్రీన్ తో లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా టీజింగ్

ఈ ప్యాడ్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజింగ్ కూడా చేస్తోంది

Moto Pad 60 Neo: మోటో పెన్ సపోర్ట్ మరియు 2.5K స్క్రీన్ తో లాంచ్ అవుతోంది.!

Moto Pad 60 Neo: అప్ కమింగ్ ప్యాడ్ లాంచ్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ ప్యాడ్ ను మోటో పెన్ సపోర్ట్ మరియు 2.5K స్క్రీన్ వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ ప్యాడ్ కీలకమైన ఫీచర్లు మరియు ఇతర వివరాలు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Moto Pad 60 Neo: లాంచ్ డేట్

మోటో ప్యాడ్ 60 నియో టాబ్లెట్ ని సెప్టెంబర్ 12వ తేదీ 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా అనౌన్స్ చేసింది. ఈ ప్యాడ్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజింగ్ కూడా చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ ఈ ప్యాడ్ కోసం అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుండి ఈ అప్ కమింగ్ టాబ్లెట్ యొక్క కీలకమైన ప్రత్యేకతలను విడుదల చేసింది.

Moto Pad 60 Neo: కీలకమైన ఫీచర్స్

మోటోరోలా ఒక్క అప్ కమింగ్ ప్యాడ్ మోటో ప్యాడ్ 60 నియో 11 ఇంచ్ బిగ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 2.5K రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ మరియు మోటో పెన్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ మోటో అప్ కమింగ్ ప్యాడ్ కేవలం 6.9mm స్లీక్ డిజైన్ తో ఉంటుంది మరియు 490 గ్రాముల బరువుతో ఉంటుంది. ఈ ప్యాడ్ మీడియాటెక్ 6300 5జి చిప్ సెట్ కలిగి ఉంటుంది మరియు ఇది 5జి కనెక్టివిటీ కలిగిన ప్యాడ్ గా వస్తుంది.

Moto Pad 60 Neo

ఈ ప్యాడ్ ను ల్యాప్ టాప్ మాదిరిగా మార్చడానికి వీలుగా క్రాస్ కంట్రోల్స్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో గొప్ప సౌండ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ మోటోరోలా అప్ కమింగ్ టాబ్లెట్ క్వాడ్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది మరియు ఇందులో Dolby Atmos సౌండ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ టాబ్లెట్ లో వెనుక కేవలం సింగల్ కెమెరా మాత్రమే ఉంటుంది.

Also Read: Moto Buds Bass: ఈరోజు నుంచి మొదలైన మోటో Dolby Atmos సూపర్ బడ్జెట్ బడ్స్ సేల్.!

ఇక ఈ టాబ్లెట్ యొక్క ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ టాబ్లెట్ 7000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఇందులో 68W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా మోటోరోలా అందించింది. ఈ మోటోరోలా కొత్త ప్యాడ్ బాక్స్ తో పాటు మోటో పెన్ ను కూడా కలిగి ఉంటుంది. మోటోరోలా తీసుకువస్తున్న ఈ టాబ్లెట్ ను బడ్జెట్ ధరలో లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo