Moto Buds Bass: మోటోరోలా గతవారం సరికొత్తగా విడుదల చేసిన మోటో బడ్స్ బాస్ ఇయర్ బడ్స్ సేల్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది. ఈ కొత్త ఇయర్ బడ్స్ ను కేవలం 2 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో Dolby Atmos మరియు LDAC వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో మోటోరోలా లాంచ్ చేసింది. ఈ బడ్స్ కొనుగోలు చేసే ముందు మీరు తెలుసుకోవాల్సిన అన్ని వివరాలు ఇక్కడ అందించాము.
Survey
✅ Thank you for completing the survey!
Moto Buds Bass: ప్రైస్
మోటరోలా ఈ కొత్త మోటో బడ్స్ బాస్ ఇయర్ బడ్స్ ను కేవలం 1999 ప్రైస్ ట్యాగ్ తో విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చాయి. ఈ బడ్స్ ను ఫ్లిప్ కార్ట్ మరియు మోటరోలా అఫీషియల్ వెబ్సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఇయర్ బడ్స్ బ్లూ, గ్రీన్ మరియు గ్రే మూడు రంగుల్లో లభిస్తుంది.
మోటో బడ్స్ బాస్ ఇయర్ బడ్స్ హెవీ బాస్ సౌండ్ అందించే 12.4mm స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ LADC మరియు Hi-Res Wireless సపోర్ట్ తో గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుందని మోటోరోలా తెలిపింది. ఈ ఇయర్ బడ్స్ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మరియు స్పేషియల్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. కాబట్టి ఇది గొప్ప సరౌండ్ సౌండ్ ఆఫర్ చేసే సత్తా కలిగి ఉంటుంది.
ఈ మోటోరోలా కొత్త ఇయర్ బడ్స్ 50 dB యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది వెలుపలి రణగొణ ధ్వనులు నియంత్రిస్తుంది మరియు మంచి లీనమయ్యే సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ ట్రాన్స్పరెన్సీ, అడాప్టివ్ మరియు ANC ఆన్ మోడ్స్ తో వస్తుంది. ఈ మోటో బడ్స్ 6 Mic లను కలిగి ఉంటుంది మరియు మంచి కాలింగ్ కూడా అందిస్తుంది.
ఇక మోటో బడ్స్ బాస్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ IPX4 రేటింగ్ వాటర్ రెపెళ్లేంట్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ టైప్ C ఛార్జ్ పోర్ట్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 43 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. ఈ బడ్స్ సింగిల్ ఛార్జ్ తో 7 గంటల ప్లే టైమ్ అందిస్తుంది.