Tecno Pova Curve 2 5G: మోర్ బ్యాటరీ మరియు మోర్ సిగ్నల్ వంటి ఫీచర్స్ తో లాంచ్.!
టెక్నో బిగ్ బ్యాటరీ ఫోన్ ను ఎట్టకేలకు ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది
ఈ ఫోన్ ను ఈ ప్రైస్ సెగ్మెంట్ లో 8000 mAh మోర్ బ్యాటరీ తో లాంచ్ చేసింది
ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకోండి
Tecno Pova Curve 2 5G: చాలా రోజులుగా టెక్నో టీజింగ్ చేస్తున్న బిగ్ బ్యాటరీ ఫోన్ ను ఎట్టకేలకు ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. అదే టెక్నో పోవా కర్వ్ 2 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను ఈ ప్రైస్ సెగ్మెంట్ లో 8000 mAh మోర్ బ్యాటరీ మరియు 20 5G బ్యాండ్స్ సపోర్ట్ తో మోర్ సిగ్నల్ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకోండి.
SurveyTecno Pova Curve 2 5G : ప్రైస్
టెక్నో పోవా కర్వ్ 2 స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో అందించింది. ఇందులో బేసిక్ వేరియంట్ ని 8 జీబీ ర్యామ్ అండ్ 128 జీబీ తో రూ. 27,999 ధరతో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ ను 8 జీబీ ర్యామ్ అండ్ 256 జీబీ స్టోరేజ్ తో రూ. 29,999 ధరతో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ మెల్టింగ్ సిల్వర్, మిస్టిక్ పర్పల్ మరియు స్టోర్మ్ టైటానియం మూడు రంగుల్లో లభిస్తుంది.

సేల్ అండ్ ఆఫర్స్
ఈ ఫోన్ పై మంచి లాంచ్ ఆఫర్లు కూడా టెక్నో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 1,500 రూపాయల ఆల్ బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఇది కాకుండా 3 మరియు 6 నెలల No Cost EMI ఆప్షన్ పై రూ. 3,000 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందించింది. ఫిబ్రవరి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ సేల్ స్టార్ట్ అవుతుంది.
Also Read: Happy Valentine’s Day 2026 : విషెస్ మరియు సెండ్ చేయదగిన బెస్ట్ ఇమేజెస్.!
Tecno Pova Curve 2 5G : ఫీచర్స్
ఈ లేటెస్ట్ 6.78-అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా Glass 7i ప్రొటెక్షన్ మరియు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 7.42 mm అల్ట్రా స్లిమ్ డిజైన్ తో వచ్చింది. ఈ టెక్నో ఫోన్ మీడియాటెక్ Dimensity 7100 5G చిప్ సెట్, 8 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇది 6nm టెక్నాలజీ ప్రోసెసర్ మరియు ఇందులో 8 జీబీ అదనపు ర్యామ్ ఫీచర్ కూడా ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక 50 MP ప్రైమరీ సెన్సార్ మరియు జతగా 2 MP సెకండరీ సెన్సార్ తో డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 8000 mAh మోర్ అండ్ బిగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది. అంతేకాదు, ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జ్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ నెట్ వర్క్ ఎక్కువగా స్వీకరించే డిజైన్ తో పాటు 20 5G బ్యాండ్స్ సపోర్ట్ తో మంచి నెట్ వర్క్ రెస్పాన్స్ పరిధిని కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile